బాబా ఆశీస్సుల కోసం ఫ్యామిలీతో నాగార్జున ఇలా (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు హీరో అక్కినేని నాగార్జున తన కుటుంబంతో కలిసి గురువారం పంజాగుట్టలోని సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్నారు. రేపు(మే 23)న అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' విడుదల ఉండటంతో సాయిబాబా ఆశీర్వాదం కోసం ఆయయన తన భార్య అమల, కుమారులు నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి వచ్చారు.
నాగార్జున చూడటానికి నాస్తికుడిలా కనిపిస్తారు కానీ....ఆయనకు దేవుడిపై భక్తి ఎక్కువే అని అంటుంటారు ఆయన సన్నిహితులు. ఆయనలో దైవ భక్తి ఉండటం వల్లనే అన్నమయ్య, శ్రీరామ దాసు, షిరిడి సాయి బాబా లాంటి చిత్రాలు అద్భుతంగా చేయగలిగారని, నాగార్జున ఇష్టదైవం సాయి బాబా అని అంటున్నారు.
నాగార్జున మనం చిత్రానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

మనం
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం ‘మనం'. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ఈచిత్రంలో కూడా అదే రిలేషన్‌తో కూడిన పాత్రలు చేస్తున్నారు.

విడుదల
మనం చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

అక్కినేని చివరి సినిమా
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించి చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ముఖ్యపాత్రల్లో..
అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక విభాగం
ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.


Click it and Unblock the Notifications











