twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ఫామ్ హౌస్‌లో డెడ్ బాడీ.. అసలు మిస్టరీ ఏంటంటే..

    |

    అక్కినేని నాగార్జున ఫామ్ హౌస్‌ వద్ద డెడ్ బాడీ కనిపించడం, ఆ వార్త హాట్ టాపిక్‌గా మారడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఈ డెడ్ బాడీ ఎవరిది? అది నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో ఎందుకు ఉంది? ఇది హత్యేనా? ఆత్మహత్యనా? అని పలు రకాల అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు అసలు మిస్టరీ ఏంటో తేల్చేశారు. వివరాల్లోకి పోతే..

     24 గంటల్లో చేధించిన పోలీసులు

    24 గంటల్లో చేధించిన పోలీసులు

    నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించి 24 గంటల్లో ఆ మిస్టరీని చేధించారు. ఇది మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా తేల్చేశారు. మృతుడు పాపిరెడ్డిగూడకు చెందిన పాండు (32) అని గుర్తించారు.

    మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య

    మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య

    పాపిరెడ్డిగూడకు చెందిన చిన్న అంజయ్య-జంగమ్మ దంపతుల నలుగురు సంతానం. వారిలో పాండు చిన్న కొడుకు. ఆయనకింకా పెళ్ళికాలేదు. అయితే మూడో అన్న కుమార్‌ అంటే పాండుకు అమితమైన ఇష్టం ఉండేదట. అనారోగ్యం కారణంగా కుమార్‌ మరణించడంతో పాండు మానసికంగా కుంగిపోయి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమిక విచారణకు వచ్చారు పోలీసులు.

    మృతదేహం వద్ద గుళికలు లభ్యం

    మృతదేహం వద్ద గుళికలు లభ్యం

    పాండు మృతదేహం వద్ద గుళికల ఆనవాళ్లు లభ్యం కావడంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ కోణంలో దర్యాప్తు చేయగా అసలు కథ బయటకు వచ్చింది. ఈ మృతదేహం పాండు అనే వ్యక్తిదే అని పోలీసులు చెప్పారు.

    లేఖరాసి వెళ్ళిపోయాడు

    లేఖరాసి వెళ్ళిపోయాడు

    పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు బ్రతకాలని లేదని ఓ లేఖ రాసి చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు పాండు. అలా వెళ్లిపోయిన అతని కోసం కుటుంబసభ్యులు చాలాచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆ సమయంలో అతడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని తెలుస్తోంది.

    నాగార్జున సతీమణి అమల వెళ్లగా

    నాగార్జున సతీమణి అమల వెళ్లగా

    రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డిగూడలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో చాలా ఏళ్లుగా పనులేవీ జరగడం లేదు. వారం క్రితం ఆ వ్యవసాయ క్షేత్రానికి నాగార్జున సతీమణి అమల వెళ్లారు. సేంద్రియ పద్ధతిలో సాగు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకొంటుండగా అస్థిపంజరం కనిపించింది. గురువారం రోజు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ ఈ కేసుపై విచారణ చేపట్టారు.

    English summary
    The decomposed body of an unknown person was found in the farmhouse of Nagarjuna on the outskirts of Hyderabad, police said on Thursday..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X