‘స్లమ్‌డాగ్ మిలియనీర్’విలన్ తో నాగార్జున ఫైట్
'స్లమ్ డాగ్ మిలియనీర్"లో విలన్‌గా నటించిన అంకుర్ నాగార్జున తాజా చిత్రంలో విలన్‌గా కనిపించనున్నాడు. రమ్మీ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాగార్జునతో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అక్టోబర్ 10 నుంచి గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నాగ్ సరసన మమతామోహన్‌దాస్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నాగార్జుతో కింగ్ నిర్మించిన డి.శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 'ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో మోడల్స్ పాల్గొనగా ఓ పాటతోపాటు, షాయాజి షిండే, బ్రహ్మానందంల కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్స్, చేజింగ్ సీన్స్ చిత్రీకరించాం. 'స్లమ్ డాగ్ మిలియనీర్"లో విలన్‌గా నటించిన అంకుర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. అలాగే అమెరికా అమ్మాయి లిండా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. డిసెంబర్‌లోనే ఈ చిత్రం విడుదల చేసేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ఇక ఈనెల నాలుగు వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. అనంతరం మళ్లీ 12 నుంచి హైద్రాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు.సందీప్ చౌతా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, పోరాటాలు: సెల్వ, కార్యనిర్వాహక నిర్మాత: అక్కినేని వెంకటరత్నం.


Click it and Unblock the Notifications











