నాగార్జున 'గగనం' విహారం చేసే డేట్ ఎప్పుడంటే...
నాగార్జున హీరోగా రాధామోహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 'గగనం". మ్యాట్నీ ఎంటర్నైన్మెంట్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మీడియాతో నిన్న(సోమవారం) సాయింత్రం మాట్లాడుతూ...తెలుగులో ఇదో కొత్త తరహా ప్రయోగం. కథనం ఆసక్తిగా సాగుతుంది. నాగార్జున, ప్రకాష్ రాజ్ ల మధ్య నడిచే సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. దీపావళికి విడుదల చేస్తామన్నారు. అలాగే ఈ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ..విమానం హైజాక్, తదనంతర పరిణామాల నేపధ్యంలో రూపొందే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటూనే హాస్యాన్ని పంచుతుంది అన్నారు.
అలాగే గగనంలో తన పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ...కమాండోగా చేస్తున్నా. టెర్రరిజాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ టీమ్‌కు బాస్‌ని నేను. ఫ్లైట్ హైజాగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. విమానాన్ని హైజాగ్ చేసిన టెర్రరిస్టుతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు విఫలమవుతాయి. ఆ తర్వాత కమాండోలు ఏం చేశారు..? అనే ఆసక్తికర కథాంశంతో కథ సాగుతుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కాందహార్ ఇన్సిడెంట్‌ను పోలి వుంటాయి. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్ అని చెప్పాలి. మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంది. తెలుగులో 'గగనం" పేరుతో వస్తున్న ఈ చిత్రం తమిళంలో 'పయనం" పేరుతో రానున్నది అన్నారు. బ్రహ్మానందం, సనాఖాన్, పూనమ్ కౌర్, భరత్ రెడ్డి, రిషి తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, కళ: కె.కబీర్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











