ఈ సినిమాకి అవార్డులు రాకపోయినా ప్రేక్షకుల నుండి రివార్డులు వస్తాయి

By Sindhu

2010 సంవత్సరాంతంలో 'రగడ" విడుదలై విజయం సాధించి నన్ను ఆనందపరిచింది. ఈ ఏడాది శుభారంభానికి ఆ చిత్రం నాంది అయ్యింది. ఇక కొత్తసంవత్సరానికి కొత్త రకమైన సినిమా 'గగనం" చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాను. ఇది అద్బుతంగా ఉంది. 2011కు నాకు ఈ చిత్రం సక్సెస్ తో ఆరంభం అవుతుందనే ఫీలింగ్ కలిగింది. శివ, అన్నమయ్య చిత్రాలు చూసినప్పుడు ఏ విధంగా అనిపించిందో 'గగనం" చూసినప్పుడు అలానే అనిపించింది. ఈ సినిమాకి అవార్డులు వస్తాయా? అనే విషయాన్ని పక్కనపెడితే ప్రేక్షకుల నుంచి మాత్రం గ్యారంటీగా రివార్డులు వస్తాయి" అన్నారు నాగార్జున. రాధామోహన్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'గగనం". 'దిల్" రాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్స్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున పై విధంగా స్పందించారు.

'దిల్" రాజు మాట్లాడుతూ - 'తెలుగు చిత్రపరిశ్రమకు ఇదొక కొత్త సినిమా అవుతుంది. 'గగనం" ఆర్ట్ ఫిలిం కాదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గత ఏడాది 'బృందావనం" మాకు మంచి విజయాన్నిచ్చింది. ఇప్పుడు 'గగనం" కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉంది. ఈ చిత్రానికి నాగార్జునగారు ప్రత్యేకాకర్షణ. ఆయన అభిమానులను పూర్తి సంతృప్తిపరిచే చిత్రం ఇది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.

పూనమ్ కౌర్, సనాఖాన్, రవిప్రకాష్, భరత్‌రెడ్డి, హర్షవర్థన్ ఇలాంటి మంచి చిత్రంలో నటించడంపట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉన్న 'గగనం" కచ్చితంగా విజయం సాధిస్తుందని ట్రైలర్స్ వీక్షించిన దర్శకుడు దశరథ్, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల, రచయిత అబ్బూరి రవి తదితరులు అన్నారు. ఈ కార్యక్రమంలో శిరీష్, లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X