‘గగనం’ కోసం వెంకన్నకి మొక్కులు...
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాధా మోహన్ దర్శకత్వంలో యువసమ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి 'గగనం" అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ చిత్రం ప్రారంభమైన దగ్గర నుంచి 'గగనం, పయనం, వాంటెడ్" అంటూ రకరకాల పేర్లు వచ్చాయి. ఇక ఈ మూడు టైటిల్స్ లో ఏదో ఒకటి ఎన్నుకునే నిర్ణయాన్ని ప్రేక్షకులకే వదిలేసారు. కాగా 'గగనం"కి ఎక్కువ ఓట్లు పడ్డాయట. అందుకే ఈ టైటిల్ నే ఖరారు చేసారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కి నాగార్జున, దిల్ రాజు, పూనమ్ కౌర్, రాధామోహన్ తదితరుల పాల్లొన్నారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..నాగచైన్య 'జోష్" చేసేటప్పుడు దిల్ రాజు ఈ కథ నాకు చెప్పారు. కథ విన్నప్పుడు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఈ మధ్య కాలంలో నేను బాగా ఎంజాయ్ చేసిన కథ ఇది. ఈ సినిమా డిజిటల్ కెమెరాతో షూట్ చేసాం. ఇది నాకు కొత్త అనుభూతినిచ్చింది. నేను ఏ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను. కానీ ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా మాట్లాడాలనిపిస్తోంది. నేను ఈ ప్రెస్ మీట్ కు వచ్చేటప్పుడు వెంకటేశ్వరస్వామికి చేతులు జోడించి, భక్తితో చేతికి దారం కట్టుకున్నాను. నేను ఇలా చేయడం మొదటిసారి. ఈ సినిమా నాకెప్పటికీ ఒక స్పెషల్ పిల్మ్‌గా నిలిచిపోతుంది" అన్నారు. అలాగే ఇక రాబోయే చిత్రాల పేర్లు తెలుగులోనే వుంటాయని నాగార్జున అన్నారు. ఈ సినిమాని తమిళంలో 'పయనం" పేరుతో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











