Nagarjuna : హీరోయిన్ టబుతో రిలేషన్​షిప్ - సీక్రెట్గా పెళ్లి! - అసలేం జరిగిందో బయటపెట్టిన నాగార్జున!

టాలీవుడ్ కింగ్, మన్మథుడు అనగానే గుర్తొచ్చే పేరు హీరో అక్కినేని నాగార్జున. ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే ఈయనకు లేడీస్, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్లో కాస్త క్రేజ్ ఎక్కువే. ఆరు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటికీ నవ మన్మథుడిలానే కనిపిస్తుంటారు. అయితే నాగ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఈయన మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి. సీనియర్ హీరోయిన్ టబు, అనుష్కలతో ఈయన లవ్ అపైర్స్ నడిపినట్లు కథనాలు ఎన్నో వచ్చాయి. దీనిపై నాగ్ వివరణ కూడా ఇచ్చారు. అసలు తమ మధ్య అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు.

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జునకు ఉండే క్రేజే వేరు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా చకా చకా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే గత కొంత కాలంగా భారీ హిట్ లేక ఉన్న ఆయన తాజాగా ఈ సంక్రాంతికి నా సామి రంగ అంటూ వచ్చి బాక్సాఫీస్ ముందు రచ్చ చేశారు. పెద్ద సక్సెస్ అందుకుని వెళ్లిపోయారు. సినిమాకు వసూళ్లు కూడా బాగానే వచ్చాయి.

Nagarjuna Gave Clarity On Love Affair Relation With HeroinesTabu and Anushka

అయితే నాగ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే గతంలో తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. అలానే నాగ్కు ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్. వీరు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. భారీ హిట్ల కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు నాగ్ కూడా ఆరు పదుల వయస్సు వచ్చినా కూడా సినిమాలు చేయడంతో పాటు నవ మన్మథుడిలానే కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

అయితే నాగ్ మీద ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. పలువురు హీరోయిన్స్తో అఫైర్ నడిపినట్లు కూడా అన్నారు. సీనియర్ హీరోయిన్ టబు, అనుష్కలతో ఈయన ప్రేమాయనం నడిపినట్లు కథనాలు కూడా ఎన్నో వచ్చాయి. దీనిపై నాగ్ ఓ ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చారు. అసలు తమ మధ్య అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు.

Nagarjuna Gave Clarity On Love Affair Relation With HeroinesTabu and Anushka

"టబు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. మా ముందున్న ప్లాట్ నా భర్య, తను దగ్గర ఉండి కట్టించుకున్నారు. నాకు తను సినిమాల్లోకి రాకముందే తెలుసు. తను హైదరాబాద్ అమ్మాయి. నా బెస్ట్ కోవర్కర్, ఫెవరెట్ హీరోయిన్ అంటే తన పేరు చెబుతాను. మా కుటుంబ సభ్యురాలు. మా నాన్న అమ్మగారికి కూడా తను చాలా ఇష్టం. మాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. తనకు అస్సలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. తను చాల ఎక్కువ ఎమోషనల్. తనకు నేనొక సైకియార్టిక్ డాక్టర్ నేను. తనకు బాధ కలిగితే తెల్లవారుఝామున రెండు ఇంటికి నా పర్సనల్ నెంబర్కు ఫోన్ చేస్తుంది. హైదరాబాద్ వచ్చేయ్ అంటాను. మా ఇద్దరి స్నేహబంధం చాలా గట్టిది. గొప్పది. అనుష్క విషయంలో కూడా ఇలానే జరిగింది. నేనేమో హైట్ కదా అని టాల్ హీరోయిన్స్ను రికమెండ్ చేస్తాను. జోడీ బాగుంటుందని అనుష్కను తీసుకునేవాడిని. కానీ సమాజాం పాడైపోతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుకుంటున్నారు" అని నాగ్ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X