మా నాన్నకు నానికి పోలీకలు.. దేవదాస్ సక్సెస్ మీట్‌లో నాగార్జున ఉద్వేగం

నాగార్జున, నాని న‌టించిన దేవ‌దాస్ చిత్ర స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో ఘనంగా జ‌రిగింది. నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ.. నేను చాలా సూప‌ర్ హిట్ సినిమాలు నిర్మించాను. కానీ ఈ చిత్ర విజ‌యం మాత్రం నాలో చాలా న‌మ్మ‌కాన్ని పెంచేసిందని అన్నారు. నాగార్జున, నాని, రష్మిక మందన్న, దర్శకుడు ఆదిత్య శ్రీరాంతోపాటు సినిమా యూనిట్ అంతా ఈ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ప్రేక్షకుల నుంచి అద్బుతమైన రెస్పాన్స్

ప్రేక్షకుల నుంచి అద్బుతమైన రెస్పాన్స్

లాభాల కోస‌మే సినిమా నిర్మించ‌డం కాకుండా.. దేవ‌దాస్ అన్ని వైపుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న అందుకుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. నాని, నాగార్జున‌కు ప్ర‌త్యేకంగా థ్యాంక్స్. వాళ్ల ప‌ర్ఫార్మెన్స్ తోనే సినిమా ఈ స్థాయిలో ఉంది. భూప‌తి రాజా, సాయిమాధ‌వ్ బుర్రా, స‌త్యానంద్ గారికి కూడా ప్ర‌త్యేక కృత‌జ్ఞత‌లు.. అలాగే మీడియా వాళ్లకు కూడా. ప్రేక్ష‌కులంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు అని అశ్వినీదత్ తెలిపారు.

నానికి మా నాన్నకు పోలికలు

నానికి మా నాన్నకు పోలికలు

దేవ‌దాస్ ఓ మంచి క్వాలిటీ మ‌రియు జాయ్ క‌లిసిన సినిమా. వైజ‌యంతి మూవీస్‌తో ప‌ని చేయ‌డం అంటే హోమ్ బ్యాన‌ర్ లో ప‌ని చేసిన‌ట్లే ఉంటుంది. నేను ఎప్పుడూ చెబుతున్న‌ట్లే నానితో ప‌ని చేయ‌డం ఎంజాయ్ చేసాను.. చేస్తాను కూడా. మా నాన్న ఏఎన్నార్, నానికి చాలా పోలిక‌లు ఉన్నాయి. అత‌డు ఇంకా మంచి విజ‌యాలు అందుకోవాలి అని నాగార్జున పేర్కొన్నారు.

రష్మిక చాలా సరదాగా

రష్మిక చాలా సరదాగా

దేవదాస్ సెట్స్‌లో ర‌ష్మిక చాలా స‌ర‌దాగా ఉండేది. ఈ సినిమాకు నా రియ‌ల్ హీరో స్యామ్ ద‌త్. అత‌డి ఓపిక‌కు ఓ దండం పెట్టేయొచ్చు. అత‌డి ప‌ని చూసి నిజంగా గ‌ర్వంగా ఉంది. శ్రీ‌రామ్ ఆదిత్య కూడా చాలా బాగా వ‌ర్క్ చేసాడు. సినిమా మొద‌లుపెట్టిన రోజు నుంచి అండ‌గా ఉన్న మీడియాకు ప్ర‌త్యేక కృత‌జ్ఞత‌లు. అలాగే అక్కినేని అభిమానుల‌కు కూడా రుణ‌ప‌డిపోయి ఉంటాను అని నాగార్జున తెలిపారు.

చాలా జ్ఞాప‌కాలు మిగిలాయని

చాలా జ్ఞాప‌కాలు మిగిలాయని

హీరో నాని మాట్లాడుతూ.. ఈ సినిమాతో నాకు చాలా జ్ఞాప‌కాలు మిగిలాయి. అన్నింటికంటే ముందు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు నిర్మాత అశ్వినీద‌త్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. యూనిట్ ను మ‌రోసారి క‌లిసినందుకు ఆనందంగా ఉంది. ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు అశ్వినీద‌త్ గారికి థ్యాంక్యూ. మూడో వారంలో కూడా ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్లతో.. మంచి టాక్ తో ముందుకెళ్ల‌డం ఆనందంగా ఉంది అని అన్నారు.

అద్భుతమైన అనుభవమని

అద్భుతమైన అనుభవమని

దేవదాస్ చిత్రంలో నటించడం నాకు అద్భుత‌మైన అనుభ‌వం. నాగార్జున గారు.. నానితో న‌టించడం ఆనందంగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన అశ్వినీదత్ గారికి థ్యాంక్స్ అని తెలిపారు. సినిమా ఘన విజయం సాధించడం చాలా సంతోషం కలిగిస్తున్నది అని రష్మిక మందన్న అన్నారు.

సక్సెస్ సాధించినందుకు

సక్సెస్ సాధించినందుకు

దేవదాస్ సినిమా ఇంత విజ‌యం సాధించినందుకు.. ఇంత విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్నందుకు అంద‌రికీ థ్యాంక్స్.. ఇంత మంచి అవ‌కాశం అందించినందుకుప్ర‌త్యేకంగా మా నిర్మాత అశ్వినీద‌త్ గారికి కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమాకు త‌మ వంతు స‌హ‌కారం అందించిన నాగార్జున గారు, నానికి థ్యాంక్యూ. శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్, స‌త్యానంద్, భూప‌తి రాజు గారు ఇచ్చిన సూచ‌న‌లు కూడా దేవ‌దాస్ సినిమాకు హెల్ప్ అయ్యాయి. నా కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయేలా చేసిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అని ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X