‘హలో’ టీజర్ కాపీ వివాదం, మనం అవార్డు ఇష్యూపై నాగార్జున స్పందన
Recommended Video

అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హలో'. ఈ చిత్రం ద్వారా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. నాగార్జున నిర్మాత. కొన్ని రోజుల క్రితం 'హలో' టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే కాపీరైట్ ఇష్యూ రావడంతో యూట్యూబ్ దీన్ని కొన్ని గంటల పాటు డీయాక్టివేట్ చేసింది.
ఈ టీజర్లో కాపీ కొట్టిన ట్రాక్స్ వాడటం వల్లే ఇలా జరిగిందంటూ ఆ మధ్య చిన్నపాటి వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై 'హలో' ప్రెస్‌మీట్‌లో నాగార్జున స్పందించారు.

యూట్యూబ్ వారు తొలగించింది నిజమే
ఫస్ట్ టీజర్ యూట్యూబ్ వారు తీసేసిన మాట నిజమే. ఇపుడు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మోస్ట్ ఆఫ్ ది టీజర్స్ డైరెక్టర్స్ కట్ చేయడం లేదు. డైరెక్టర్లు సినిమా ఎడిటింగులో బిజీగా ఉంటారు. టీజర్ ఎడిటర్స్ అని ప్రత్యేకంగా ఉన్నారు. హలో టీజర్ బాంబేలో ఎడిట్ కావడం వల్లే ఇదంతా జరిగింది అని నాగార్జున తెలిపారు.

ఆన్ లైన్ నుండి సౌండ్ ట్రాక్స్ తీసుకున్నాం
‘హలో' టీజర్ ఎడిట్ అయినపుడు వాళ్లు కొన్ని సౌండ్ ట్రాక్స్ వేశారు. ఆన్ లైన్లో చాలా సౌండ్ ట్రాక్స్ ఉంటాయి. మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అప్పుడప్పుడు తమ సినిమాల్లో ఇలాంటివి డతారు. అలా ‘హలో' టీజర్ కోసం కొన్ని ట్రాక్స్ తీసుకున్నాం. వాటిని ‘హలో' మ్యూజిక్ తో కలపడం జరిగిందని నాగార్జున తెలిపారు.

మిస్ కమ్యూనికేషన్ వల్లే ఇలా జరిగింది
హాంకాంగ్ ఏజెన్సీ వద్ద మేము వాటిని తీసుకున్నాం. వాళ్లు హాలీవుడ్‌కి ఏజెంట్స్. వీళ్లకి, వాళ్లకి మిస్ కమ్యూనికేషన్ జరిగింది. ఈమెయిల్ వెళ్లింది. కానీ మనకు డే అయినపుడు వాళ్లు అక్కడ పడుకుని ఉంటారు. అందుకే 6 గంటల పాటు టీజర్ ఎవరికీ కనిపిచకుండా పోయింది. అంతకు మించి ఇందులో ఏమీ లేదు.... అని నాగార్జున తెలిపారు.

ట్రైలర్ విషయంలో జాగ్రత్త తీసుకున్నాం
టీజర్ విషయంలో అలా జరిగింది కాబట్టే ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను పట్టుబట్టి అనూప్ రూబెన్స్ తో చేయించాం. ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ పనితో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఇలా చేయక తప్పలేదు అని నాగార్జున తెలిపారు.

ఏ మాత్రం అర్థం కాకుండా మాత్రం ఉండదు
‘మనం' సినిమా కాంప్లికేటెడ్ అనుకుంటే ‘హలో' కూడా కాంప్లికేటెడ్. కానీ దర్శకుడు విక్రమ్ కే కుమార్ చెప్పే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఈ సినిమాలో కొన్ని పజిల్స్ ఉన్నాయి. అవి ఎలా ఓపెన్ అప్ అవుతాయనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది. ఏ మాత్రం అర్థం కాకుండా మాత్రం ఉండదు.... అని నాగార్జున తెలిపారు.

మనం అవార్డు వివాదంపై
ఇటీవల విడుదలైన ‘హలో' ట్రైలర్లో వేసిన కొన్ని స్లైడ్స్ ద్వారా ‘మనం' సినిమాకు నంది అవార్డు రాని అసంతృప్తిని నాగార్జున పరోక్షంగా వెల్లగక్కారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ‘హలో' ప్రెస్ మీట్ లో నాగార్జున స్పందించారు.

అంతకన్నా పెద్ద అవార్డు మాకు అవసరం లేదు
‘మనం' అనేది నాన్నగారి చివరి సినిమా. ఆ సినిమాను ఎంతో ప్రేమతో ప్రేక్షకులందరూ ఆదరించారు. అదే మాకు పెద్ద అవార్డు. ఆస్కార్ కంటే గొప్పగా భావిస్తున్నాం. అంతకన్నా మాకు అవసరం లేదు.... అని నాగార్జున తెలిపారు.


Click it and Unblock the Notifications











