ఆ ముగ్గురికే క్రెడిట్ దక్కుతుందని శ్రీరామదాసు చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డు పొందిన నాగార్జున అంటున్నారు. ఈ అవార్డును ఆ ముగ్గురికే అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు, రచయిత జె.కె. భారవి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిలదే ఆ గొప్పతనమని ఆయన అన్నారు. అన్నమయ్య, రామదాసు వంటి పాత్రలు ఎప్పుడు పడితే అప్పుడు లభించవని, ఆ పాత్రలను పోషించడం తన అదృష్టమని ఆయన అన్నారు. నాగార్జునకు మూడు సార్లు ఉత్తమ నటుడికి గాను నంది అవార్డులు వచ్చాయి. అన్నమయ్య సినిమాలో నటనకు మొదటిసారి అవార్డు వచ్చినప్పుడు నిజంగా కిక్ ఇచ్చిందని, సంతోషం సినిమాలో నటనకు రెండో సారి వచ్చిందని ఆయన చెప్పారు. శ్రీరామదాసు పాత్రకు గాను మూడో సారి అవార్డు రావడం సంతృప్తిని కలిగించిందని ఆయన చెప్పారు. కమర్షియల్ గా కూడా ఆ సినిమా విజయం సాధించిందని ఆయన చెప్పారు. మంచి పరిశోధనతో కూడిన కథ వస్తే భక్తి చిత్రాలు ఇక ముందు కూడా చేయడానికి తాను సిద్ధమేనని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, April 22, 2026, 6:44 [IST]