అమలతో పెళ్లి అలా జరిగింది.. చైతూ, సమంత మ్యారేజ్ గురించి నాగార్జున (ఇంటర్వ్యూ)

By Rajababu

అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. త్వరలోనే అక్కినేని నాగార్జున నటించే రాజు గారి గది2 చిత్రం విడుదల కాబోతున్నది. ఈ రెండు ఈవెంట్లు అక్టోబర్‌లోనే జరుపుకోవడం టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అక్టోబర్ 6, 7 తేదీల్లో నాగచైతన్య, సమంతల వివాహం జరుగుతున్న నేపథ్యం, రాజు గారి గది2 విడుదలవుతున్న సందర్భంగా నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సమావేశంలో నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 6న చైతూ, సమంత పెళ్లి

6న చైతూ, సమంత పెళ్లి

వ్యక్తిగత జీవితానికి సంబంధించి అక్టోబర్ నెల నాకు స్పెషల్. నాగచైతన్య, సమంత పెళ్లి అక్టోబర్ 6, 7 తేదీల్లో జరుగుతున్నది. మేమంత చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. రెండు మతాలు, సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడం బాగుంది. రెండు రకాల పెళ్లి చేసుకోవడం ద్వారా ఒక పెళ్లిలో పంచె ధరించవచ్చు. మరో పెళ్లిలో సూట్ వేసుకోవచ్చు.

Recommended Video

Nagarjuna Speaks To Media Exclusively That October Month Is Very Special For Me
 నేను వారికి అలా సలహా ఇచ్చేవాడిని

నేను వారికి అలా సలహా ఇచ్చేవాడిని

చైతూ, సమంత పెళ్లిలో ఆసక్తికరమైన మరో విషయం మరోకటి ఉంది. మీకు నచ్చిన అమ్మాయిలను జీవిత భాగస్వామిగా మీరు ఎంచుకోండి నేను ఎప్పుడూ అఖిల్, చైతూలకు చెపుతుండే వాడిని. నేను దగ్గర ఉండి ఇంట్లోనే పెళ్లి జరిపిస్తాను. పెళ్లి మండపంలో దగ్గర కూర్చుని స్వయంగా నేను జరిపిస్తాను. అది నాకు ఆనందంగా ఉంటుంది అని చెప్పేవాడిని అని నాగార్జున చెప్పారు.

 ఏడడుగల ప్రాధాన్యం..

ఏడడుగల ప్రాధాన్యం..

ఆర్య సమాజ్‌ పద్దతిలో పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే పెళ్లి సమయంలో నడిచే ఏడు అడుగుల ప్రాధాన్యతను పండితులు చక్కగా వివరిస్తారు. ప్రతి మంత్రం గురించి అర్థమయ్యేలా చెబుతారు. నేను అమల, ఆర్య సమాజ్ పద్దతిలోనే పెళ్లి చేసుకొన్నాం. మా పెళ్లి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికి ఆ గుర్తులు వెంటాడుతుంటాయి.

 ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే

ఫ్యామిలీ మెంబర్స్‌కు మాత్రమే

చైతూ, సమంతల పెళ్లి కేవలం కుటుంబ వ్యవహారమే. రామానాయుడు కుటుంబ సభ్యులు, అక్కినేని ఫ్యామిలి సభ్యులు, సమంత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారు. కేవలం వందమంది మాత్రమే పెళ్లికి హాజరవుతారు.

 త్వరలో డిన్నర్ ఏర్పాటు

త్వరలో డిన్నర్ ఏర్పాటు

సినీ పరిశ్రమకు సంబంధించిన వారిని ఎవరినీ పిలువడం లేదు. ఎందుకంటే అందరూ కావాల్సిన వారే. అందుకే సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులకు త్వరలో హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేస్తాం.

 చాలా సింపుల్‌గా..

చాలా సింపుల్‌గా..

చైతూ, సమంత పెళ్లి అట్టహాసంగా చేయడంలేదు. చాలా సింపుల్‌గా చేస్తున్నాం. ఎందుకంటే చైతూకు విలాసవంతంగా చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే గోవా చర్చిలోనూ, ఓ ఆలయంలో పెళ్లిని ప్లాన్ చేశాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X