బాడీగార్డ్ దర్శకుడితో నాగార్జున సినిమా
డాన్ శీను, బాడీగార్డ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. తొలి రెండు సినిమాలు రవితేజ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కించుకున్న ఈ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ లభించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు హీరో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఎంఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.
నాగార్జున ఇటీవలే తన సోషియో ఫాంటసీ మూవీ 'డమరుకం' షూటింగ్ పూర్తి చేసుకుని...'షిరిడి సాయి బాబా' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది వరకు నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సూపర్ హిట్ భక్తిరస చిత్రాలను నిర్మించిన రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల విడుదలైన నాగార్జున 'రాజన్న' సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ....వసూళ్ల పరంగా అసంతృప్తిని ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కొన్ని వర్గాలను మాత్రమే మెప్పించగలిగింది. ఈ నేపథ్యంలో నాగార్జున తన తర్వాతి సినిమాలు ఢమరుకం, షిరిడి సాయి బాబా చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











