నాగార్జునను ఇబ్బంది పెడుతున్న ‘ఈగ’
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటిస్తున్న తాజా సినిమా 'రాజన్న" డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. తెలంగాణ అంశంతో ముడిపడి ఉన్న ఈ సినిమా కాసులు బాగానే కురిపిస్తుందని నాగ్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రవర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రి కోసం ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించాడు రాజమౌళి. అంతా బాగానే ఉంది కానీ...విడుదల సమయం వచ్చే సరికి రాజమౌళితో పెద్ద చిక్క వచ్చి పడింది నాగార్జునకి.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఈగ". యంగ్ హీరో నాని, హాట్ హీరోయిన్ సమంత ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. రాజమౌళి ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జునకు బెంగ పట్టుకుంది. రాజమౌళి సినిమా అంటేనే ప్రేక్షకులు పడి చస్తారు. ఆ ప్రభావం తన సినిమాపై పడుతుందేమోనని మదన పడుతున్నాడు నాగార్జున. మరి ఈ నేపథ్యంలో తండ్రి దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రాజమౌళి తన సినిమాను వాయిదా వేసుకుంటాడో? లేక నాగార్జున వెక్కి తగ్గుతాడో? లేక రెండు ఒకే సారి విడుదల చేస్తారో? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











