‘ఆది శంకర’లో అక్కినేని నాగార్జున
దర్శకేంద్రుడి దర్శకత్వంలో 'షిర్డీ సాయి" అవతరించబోతున్న అక్కినేని నాగార్జున సుప్రసిద్ధ రచయిత జె.కె. భారవి దర్శకత్వంలో పురడు పోసుకుంటున్న 'జగద్గురు ఆది శంకర"లో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి కనువిందు చేయబోతున్నారు. భారవి చెప్పిన కథ విని, ఇంత వరకు చిత్రించిన టోటల్ రషెస్ చూసి, అద్భుతంగా ఉందని అభినందిస్తూ ఆది శంకరలో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'నా అభిమాన కథనాయకుడు నాగార్జునను ఈ పాత్రలో చూడాలని 3 ఏళ్లుగా కలలుకన్నాను. ఆ కలను అవలీలగా ఒక్క స్ట్రోక్ తో నాగం నిజం చేశారు. త్వరలో అన్నమయ్య, శ్రీరామదాసులను మించిన సబ్జెక్టు ఇస్తాను" అంటూ భారవి ఉద్వేగంతో చెప్పారు.
ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











