నాగార్డున హెయిర్ స్టైల్ ఖర్చు ఇరవై లక్షలు
నాగార్జున హెయిల్ స్టైల్ కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి స్టీవ్ అనే స్పెషలిస్టుని రప్పించి చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందునిమిత్తం ఇరవై లక్షలు రూపాయలు వరకూ ఖర్చుపెట్టారని ఓ ఆంగ్ల పత్రిక కథనం. అయితే అది ఢమురకం నిర్మాత బడ్జెట్ లోది కావటం విశేషం. ఇక ఈ విషయాన్ని చాలా పాజిటివ్ గా చెప్తూ.. ఆయన తన సినిమా పట్ల చాలా శ్రద్ద ఉన్న మనిషి. ప్రతీ విషయంలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. హెయిర్ స్టైయిల్ కూడా ప్రేక్షకుల్లో ఓ విధమైన ఇంపాక్ట్ కలగచేస్తుందని ఆయన ఇలా డబ్బు ఖర్చైనా సరే అని నిపుణుల సలహాలు, సూచనలుతో తనను తాను మార్చుకుంటున్నారు. అందుకే నాగార్జున నిత్య మన్మధుడులాగ ఉంటున్నాడని అంటున్నారు. ఇక రాజన్నలోనూ ఆ గెటప్ కి హెయిర్ స్టైల్ ని స్టీవే డిజైన్ చేసినట్లు చెప్తున్నారు.
ఇక గతంలో ఆర్య 2 సమయంలో అల్లు అర్జున్ కూడా ఓ హెయిర్ స్టైల్ స్పెషలిస్ట్ ని రప్పించి, సినిమా పూర్తయ్యే వరకూ దగ్గర పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగార్జున ఢమురకం చిత్రంలో బిజీగా ఉన్నారు. శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం ఓ సోషియో ఫాంటసీగా రూపొందుతోంది. అనూష్క కాంబినేషన్ లో నాగార్జున ఈ చిత్రం చేస్తున్నారు. మరో ప్రక్క నాగార్జున చిత్రం రాజన్న కూడా విడుదలకుస సిద్దమైంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











