»   » సమంత అలా పిలిస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చా : నాగార్జున

సమంత అలా పిలిస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చా : నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జునకు త్వ‌ర‌లో ఇద్ద‌రు కోడ‌ళ్లు రాబోతున్నారు. అయితే ఈ గ్రీకువీరుడిని చూసి కోడ‌ళ్లు మామ అని పిలిచేందుకు సిగ్గుప‌డుతున్నార‌ట‌ . స్ర్కీన్‌పైనా, రియ‌ల్ లైఫ్ లోనూ నాగ్‌ను చూస్తే..అంత ఏజ్‌లాగా అనిపించ‌రు. మామగారు అనిపించాలా ఉండరు. కానీ కోడళ్లు ఏమని పిలవాలి మరి..ఈ విషయమై నాగార్జున ఓ మీడియా సంస్దకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ప్రసక్తి వచ్చింది.

మరి యాభై ఏళ్లు పైబడినా ఇప్పటికీ మన్మథుడిలానే కనిపించే నాగార్జునను.. వచ్చే కోడళ్లు ఏమని పిలుస్తారు? ఇప్పటికీ మీరు ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా క‌నిపిస్తారు.. ఇప్పుడు మామ‌గారూ ఇద్ద‌రి కోడ‌ళ్ల‌తో పిలిపించుకోవ‌డం ఇబ్బందే క‌దా! అని ప్రశ్నిస్తే...నాగార్జున నవ్వుతూ... "అది కాబోయే కోడళ్లు శ్రియా భూపాల్, సమంతలకు సమస్యగా ఉందేమో! నాకు మాత్రం కాద‌న్నారు.

Nagarjuna

శ్రియా భూపాల్‌ చిన్నప్పట్నుంచీ నాగ్‌ మామ అని పిలుస్తుంది. స‌మంత మాత్రం నాగ్ మామ అని పిలిచేందుకు ఇబ్బంది ప‌డుతున్న‌ట్ట‌నిపిస్తోంది.. "నన్ను ఏమని పిలవబోతున్నావ్‌" అని స‌మంత‌ని అడిగితే న‌వ్వి ఊరుకుంటుందే త‌ప్పా..స‌మాధానం చెప్ప‌లేదు. పెళ్ల‌య్యేస‌రికి నిర్ణ‌యించుకుంటుందేమో చూడాలి అంటూ నాగ్ జ‌వాబిచ్చారు.

ఎప్పుడూ 'నాగ్ సార్' అని సమంతా పిలుస్తుందని చెప్పిన నాగ్.. ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని సమంతకు చెప్పినట్లు నాగ్ వివరించాడు. అయితే సమంతా మాత్రం తనను ఏమని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదని నవ్వేశాడు.

ఇప్పటికే నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహం.. జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కుటుంబాల్లోనూ పెళ్లిపనులను ప్రారంభించేశారు. మండువేసవి మేలో.. అఖిల్ వివాహ వేడుక ఇటలీలో జరగబోతోంది. మరి ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిథులే హాజరు కాబోతున్నారట. ఆ విషయాలను నాగార్జునే వెల్లడించారు. కేవలం 150 మంది సమక్షంలోనే పెళ్లి జరుగుతుందని, రిసెప్షన్ గ్రాండ్‌గా హైదరాబాద్‌లో చేస్తామని చెప్పాడు.

English summary
Sam is calling Nag as "Nag Sir" so far. But since she's going to be part of the family, she is in dilemma on what to call him. Already, Nag said to have given instructions to Sam not to call him "Nag Sir" anymore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu