కల్యాణ్ కోసం...నాగార్జున హల్ చల్
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున శనివారం గుంటూరులో హల్ చేశారు. కల్యాణ్ జువెల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నాగ్ గుంటూరులో కొత్తగా ప్రారంభమైన కల్యాణ్ షోరూంను ప్రారంభించారు. నాగార్జున రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరోను చేసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫ్యాన్స్ ఎవరూ హద్దులు దాటకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ....కల్యాణ్ జువెల్లర్స్ వారి నమ్మకమే జీవితం నినాదం నచ్చిందని, నాణ్యతలో తమకెవరూ సాటిరారని నిరూపించారని అన్నారు. ఆ సంస్థతో తన బంధం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సినిమాల విసయాలకొస్తే... నాగార్జున ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి దర్శకత్వంలో రూపొందుతున్న రాజన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్లకు స్వయంగా రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











