ఆ ఫ్రీమేక్ లో నాగ్?

ఇదే నిజమైతే నాగార్జున కోచ్ గా ఈ చిత్రంలో కన్పడుతారు. అయితే మరి హాకీనా మరేదైనా అనేది త్వరలో తెలియవచ్చు. అలాగే ఇంతకు ముందు కూడా నాగార్జున..స్వయంగా నమస్తే లండన్ స్టోరిని తెలుగు చేయించారు. కానీ తర్వాత అ ప్రయత్నం మానుకున్నారు. దీన్ని బట్టి ఈ చిత్రం ముందకెళ్తుందా..లేక మరో స్క్రిప్టు వింటారా అన్నది తేలాల్సిందే. హాకీ క్రీడా నేపథ్యంలో షారూక్ ఖాన్ హాకీ కోచ్ గా హిందీలో నటించిన 'ఛక్ దే ఇండియా' చిత్రం 2007 ఆగస్టు 10న విడుదలై ఘనవిజయం సాధించింది. షిమిత్ అమిన్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఆ చిత్రాన్ని నిర్మించారు.
గుణ్ణం గంగరాజు శిష్యుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారని అంటున్నారు. పూర్తి స్ధాయి మన నేటివిటీకి మార్చి చెప్పటంతోఈ చిత్రానికి పని చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినిపిస్తోంది.అయితే ఈ చిత్రాన్ని కింగ్ నిర్మాత శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తారా లేక గంగరాజే స్వయంగా నిర్మతగా వ్యవహరిస్తారా అనే తెలియరాలేదు. అలాగే రైట్స్ తీసుకుని రీమేక్ చేస్తారా లేక ఆ చిత్రం ఇచ్చిన స్పూర్తితో కొత్త కథ తయారు చేసారా అనేదే అంతటా టాపిక్ గా మారింది. ఇక ఆ మధ్యన ఓం శాంతి ఓం చిత్రాన్ని నాగార్జున చేస్తారని టాక్ వచ్చింది. అయితే నాగార్జున మాత్రం తెలివిగా అందులో పాటను ప్రేరణగా తీసుకుని కింగ్ లో పెట్టించుకున్నారు. ఓం శాంతి పాయింటు ఎలానూ..రామ్ చరణ్ తేజ సినిమాలో వస్తుంది కదా అని ఆ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో చెప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











