మంజుల చిత్రంలో నాగార్జున
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల. ఆమె నిర్మాత కూడా. నానీ, పోకిరి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. ఇపుడు తాజాగా నాగార్జున హీరోగా సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమె ప్రొడక్షన్ హౌస్ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకుముందే విష్ణువర్థన్ తో సినిమా చేయడానికి కూడా మంజుల నిర్ణయం తీసుకుంది. ముందుగా ఏ సినిమా ప్రారంభం అవుతుందో తెలియదు కానీ విష్ణువర్థన్, నాగార్జునలు కలిసి నటిస్తున్న చిత్రం ఇపుడు నిర్మాణంలో ఉంది.


Click it and Unblock the Notifications











