twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణనిస్తాం

    By Srikanya
    |

    అన్నపూర్ణ స్టూడియోస్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా (ఐఎస్‌ఎఫ్‌ఎం)ని అక్కినేని నాగార్జున ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎస్‌ఎఫ్‌ఎమ్‌ లోగోను నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ కర్ట్‌ ఇండెర్బిడ్జిన్‌, అమల, అఖిల్‌, సుమంత్‌, సుప్రియ, నాగసుశీల, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ''అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రాంగణంలో ఇది ఏర్పాటవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తాం. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. విదేశీ చిత్రాలు ఇక్కడికొస్తున్నాయి. దీని ఫలితంగా మన సినిమా, టీవీ, యానిమేషన్‌ రంగాలు ప్రపంచస్థాయిలో పోటీపడాల్సి వస్తోంది. అందుకు తగ్గ నిపుణుల్ని అందించే శిక్షణాలయాల అవసరం ఎంతైనా ఉంద''న్నారు.

    అక్కినేని మాట్లాడుతూ ''చిత్ర పరిశ్రమ, సమాజం, దేశం కోసం ఏం చేయగలమన్న విషయమై మా కుటుంబంలో తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే మీడియాలో విద్యను అందించడం ద్వారా రుణం తీర్చుకోవచ్చని భావించాం. లాభాపేక్షలేని సంస్థ ఇది. రేపటి తరం మీడియా నిపుణులను తీర్చిదిద్దాలన్నదే మా తపన'' అన్నారు.

    English summary
    Annapurna Studios Private Limited launched of the International Institute of Film & Media (ISFM) in Hyderabad, the only private, non-profit film and media institute in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X