twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ముద్దులు చూసి సమంత షాక్ అయింది.. చాలా సేపు గొనిగింది: నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    |

    టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం 'మన్మథుడు 2'. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది. ఈ సందర్భంగా యాంకర్ సుమతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    ఆ టైటిల్ ఎందుకు పెట్టారో..

    ఆ టైటిల్ ఎందుకు పెట్టారో..

    ఈ ఇంటర్వ్యూలో నాగార్జున ‘మన్మథుడు' సినిమా గురించి మాట్లాడాడు. ‘ఆ సినిమా వచ్చి పదిహేడు సంవత్సరాలు అవుతోంది. అసలు నా సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో ఇప్పటికీ అర్థం కాలేదు. విజయ్ భాస్కర్ గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందా అని నాకెప్పటి నుంచో డౌట్ ఉంది' అని ఆయన చెప్పుకొచ్చాడు.

    నవ్వుతూనే ఉంటారు

    నవ్వుతూనే ఉంటారు

    అలాగే, సినిమా ఎలా ఉంటుందన్న దానిపై అక్కినేని నాగార్జున మాట్లాడారు. ‘సినిమా అంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నాది, వెన్నెల కిశోర్ కాంబినేషన్ టామ్ అండ్ జెర్రీలా అనిపిస్తుంది. మొత్తంగా ‘మన్మథుడు 2' కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంటారు' అని ఆయన వెల్లడించారు.

    వాళ్ల దగ్గర కిస్‌ల గురించి చర్చించలేదు

    వాళ్ల దగ్గర కిస్‌ల గురించి చర్చించలేదు

    ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారని సుమ అడిగిన ప్రశ్నకు.. ‘వాళ్లందరికీ బాగా నచ్చింది.. చాలా ఫన్నీగా ఉంది నాన్నా అన్నారు. అంతేకానీ, ట్రైలర్‌లో ఉన్న కిస్‌లు గురించి వాళ్లు పెద్దగా చర్చించలేదు. నేను వాళ్లను అడగడం బాగోదు కదా' అని నాగ్ వివరించాడు.

    సమంత షాక్

    సమంత షాక్

    పిల్లల రియాక్షన్ తెలిసింది. మరి కోడలు సమంత ఎలా రెస్పాండ్ అయింది అని సుమ అడగ్గానే.. ‘సమంత రియాక్షనా.. ఫస్ట్ చూసింది కానీ, ఆమెకు నచ్చలేదు. మా మామను ఇలా చూస్తానని అనుకోలేదంటూ షాక్ అయ్యింది. చాలా సేపు ఏదేదో గొనిగింది. ఆ తరువాత నువ్వు చూసే కోణం మార్చుకో అని చెప్పడంతో మరోసారి చూసింది. అప్పుడు బాగుంది మామా అని చెప్పింది' అని నాగ్ అన్నాడు.

    English summary
    Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in August 9th. In this movie young heroine Rakul Preet Singh romance with Nagarjuna. this film directed by Rahul Ravindran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X