అఖిల్‌తో సినిమా తీయను.. నాదేదో నేను చూసుకొంటా.. దేవుడా ఎలాగైనా చూసుకో.. నాగార్జున

అక్కినేని అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం హల్లో. మనం చిత్రానికి దర్శకత్వం వహించిని విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అక్కినేని నాగార్జున నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 22 రిలీజ్

By Rajababu

అక్కినేని అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం హల్లో. హీరో అఖిల్ నాగార్జున కుమారుడు కాగా, హీరోయిన్ కల్యాణి దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ లక్ష్మీ కుమార్తె. మనం చిత్రానికి దర్శకత్వం వహించిని విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అక్కినేని నాగార్జున నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 22 రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగార్జున అక్కినేని మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగార్జున వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

Recommended Video

'హలో' స్టోరీ బయట పెట్టిన నాగ్ ! | Filmibeat Telugu
డిసెంబర్ 22న రిలీజ్

డిసెంబర్ 22న రిలీజ్

అన్నపూర్ణ స్టూడియో బ్యానర్, మనం బ్యానర్‌లో అక్కినేని అఖిల్ నటించిన హల్లో చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానున్నది. టీజర్లు, ట్రైలర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా, య్యూటూబ్ ద్వారా 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దాంతో మాకు మంచి సంతోషం కలుగడంతోపాటు ప్రాజెక్ట్‌పై నమ్మకం పెరిగింది.

 10న వైజాగ్‌లో ఆడియో రిలీజ్

10న వైజాగ్‌లో ఆడియో రిలీజ్


హల్లో చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని డిసెంబర్ 10న విశాఖపట్నంలోని ఎంజీఎం స్టేడియంలో నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో అఖిల్ ఓ పాట పడుతున్నాడు. ఫ్యాన్స్‌ను సంతోషపెట్టేలా ఓ పాటపై డ్యాన్స్ కూడా చేయనున్నాడు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, అద్భుతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం.

నాలుగు పాటలు రిలీజ్

నాలుగు పాటలు రిలీజ్

ఇప్పటికే ఒక్క నిమిషం నిడివి ఉన్న పాటను రిలీజ్ చేశాం. ఆ పాటను రిలీజ్ చేయడం అఖిల్‌కు ఇష్టం లేదు. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ నా చేతిలో ఉంటుంది కాబట్టి నేనే ఆ పాటను రిలీజ్ చేయించాను. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో నిమిషం నిడివి ఉన్న నాలుగు పాటలను రిలీజ్ చేయనున్నాం.

అందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథ

హల్లో ఓ అందమైన ప్రేమకథ. ఓ రొమాంటిక్ కథా చిత్రం. దర్శకుడు విక్రమ్ సినిమాలో ఉండే మ్యాజిక్ ఓ పక్క నడుస్తూనే ఉంటుంది. విక్రమ్ చెప్పిన దానికంటే అద్భుతంగా తెరకెక్కించాడు. అఖిల్ కూడా బాగా యాక్ట్ చేశాడు. సినిమా చూస్తే అఖిల్ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది.

అఖిల్‌తో కల్యాణి

అఖిల్‌తో కల్యాణి

హల్లో చిత్రంలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ లక్ష్మీ దంపతుల కూతురు కల్యాణి అఖిల్ పక్కన నటిస్తున్నది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వాస్తవానికి నా పక్కన ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఎందుకో కుదురలేదు. కానీ ఇప్పుడు ఆమె కుమార్తె అఖిల్‌తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నది. ఈ విషయాన్ని లిజీ ఈ మధ్య గుర్తు చేసింది.

 అద్భుతంగా యాక్షన్ సీన్లు

అద్భుతంగా యాక్షన్ సీన్లు

హల్లో చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ అద్బుతంగా ఉంటాయి. ఫైట్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్‌ను రప్పించాం. కృష్ణానగర్‌లోని స్లమ్స్ ఇండ్లపై యాక్షన్ సీక్సెన్స్ ఉంటాయి. దాదాపు 30 రోజులపాటు ఫైట్స్‌ను చిత్రీకరించాం. ఇప్పటివరకు తెలుగు తెర మీద ఎవరూ చూసి ఉండరు. జాకీచాన్ తరహా ఫైట్స్ సీక్వెన్స్ ఉంటాయి.

హల్లో భావోద్వేగమైన కథ

హల్లో భావోద్వేగమైన కథ

హల్లో చిత్రంలో ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో ఆనందభాష్పాలు రాలుతాయి. విడిపోయిన ప్రేమికులు ఎలా కలుసుకొంటారు. కలుసుకోవడానికి మధ్య ఏమి జరిగింది. ఈ చిత్రం ఒకరోజులో జరిగే కథ అంటే.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగే కథ. స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉంటుంది. క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. వారు కలుసుకోవాలని ప్రేక్షకులు అనుకొని ఉద్వేగానికి గురవుతారు. వారిని ఎలాగైనా కలుపు అని దేవుడిని వేడుకుంటాం.

నాని టాలెంటెడ్ యాక్టర్

నాని టాలెంటెడ్ యాక్టర్

హల్లో చిత్రం, నాని నటించిన ఎంసీఏ చిత్రం ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. పోటీ అనే ప్రశ్నే లేదు. నాని కూడా టాలెంటెడ్ యాక్టర్. డిసెంబర్ చివరి వారంలో సెలవులు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఎనిమిది రోజులు సెలవులు ఉన్నాయి. డిసెంబర్‌లో రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం వల్ల పెద్ద సమస్య ఉండదు.

అందుకే భారీగా ఖర్చు

అందుకే భారీగా ఖర్చు

నా కొడుకు అఖిల్ మీద చాలా ప్రేమ ఉంది. అందుకే భారీగా ఖర్చుపెట్టాం. కానీ సినిమాకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాం. అఖిల్‌కు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. భవిష్యత్‌లో ఇవ్వాల్సింది ఇప్పుడే ఇచ్చాను.

డాన్సులపై నాగ్ సెటైర్

డాన్సులపై నాగ్ సెటైర్

హల్లో చిత్రంలో పాటలు కథకు అనుగుణంగా ఉంటాయి. 50 మందిని బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి హీరో ఎక్సర్‌సైజులు చేసినట్టు ఉండదు. డ్యాన్సులు ఉంటే సినిమాలు హిట్ అవుతాయనుకొంటే తప్పే. ఈ చిత్రంలో డాన్యులు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.

అఖిల్ ఎంట్రీ ఇదే

అఖిల్ ఎంట్రీ ఇదే

నా లెక్క ప్రకారం అఖిల్ ఇండస్ట్రీకి ఇంట్రడక్షన్ ఇదే. అఖిల్‌ను ఎలా చూడాలనుకొన్నానో అలా హల్లో తీశాను. ఇక బయట చిత్రాల్లో నటించే విషయాన్ని చూసుకో అని అఖిల్‌కు చెప్పాను. నేను ఇక నీతో సినిమాలు తీయను. నా సినిమాలు నేను తీసుకోవాలి. నన్ను నేను తెరపై చూసుకోవాలి అని చెప్పినట్టు నాగార్జున చమత్కరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X