twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా టికెట్ రేట్లు తగ్గింపు ఇబ్బందే కానీ నాక్కాదు..చిరు భేటీ గురించి వారం ముందే అంటూ నాగార్జున వ్యాఖ్యలు!

    |

    ఏపీలో తగ్గించిన సినిమా టికెట్ రేట్లు వల్ల తన సినిమా వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నాగార్జున చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే దాని మీద కొంత వరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నాగచైతన్య. ఇప్పుడు తాజాగా అదే విషయం మీద నాగార్జున కూడా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

    నాగార్జున వ్యాఖ్యల కలకలం

    నాగార్జున వ్యాఖ్యల కలకలం

    టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కుమారుడు నాగ చైతన్య తో కలసి బంగార్రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా 14వ తేదీన విడుదల కాబోతుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ముందు నుంచి ఉన్న కొన్ని పెద్ద సినిమాలు బరిలో నుంచి తప్పుకోవడంతో సంక్రాంతి మొత్తానికి ఇది పెద్ద సినిమాగా నిలబడింది. అయితే ఈ సినిమా ఈవెంట్ లో నాగార్జున చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

    హ్యాపీగానే ఉన్నా

    హ్యాపీగానే ఉన్నా

    ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం గురించి స్పందించమని మీడియా ప్రతినిధులు కోరగా ముందు అది రాజకీయ అంశం అని నేను సినిమా వేదిక మీద రాజకీయ అంశాలు మాట్లాడను అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన సినిమా టికెట్ రేట్లు తన సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ విషయంలో తాను హ్యాపీగానే ఉన్నాను అన్నట్లు కామెంట్ చేశారు. ఈ విషయం మీద తాజాగా నాగచైతన్య మాట్లాడుతూ ఈ రేట్ల తగ్గింపు జిఓ ఏప్రిల్ నెలలో వచ్చింది మేము ఆగస్టు నెలలో బంగార్రాజు సినిమా షూటింగ్ మొదలుపెట్టాం అని అన్నారు.

    టచ్ లోనే ఉంటా

    టచ్ లోనే ఉంటా

    అంటే ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన సినిమా థియేటర్ రేట్లు ప్రకారమే మేము బడ్జెట్ వేసుకున్నాము కాబట్టి మా సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేదు అనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మీడియాతో మాట్లాడుతూ నాగార్జున కూడా ఇదే అంశం మీద క్లారిటీ ఇచ్చారు. ఈ రేట్ల తగ్గింపు జిఓ ఏప్రిల్ నెలలో వచ్చింది మా సినిమా ఆగస్టులో మొదలైంది మేము ఈ అంశం మీద ముందు చర్చలు జరిపి దానికి అనుగుణంగానే బడ్జెట్ వేసుకున్నాము అని అన్నారు. అలాగే రిలీజ్ కూడా అదే విధంగా ప్లాన్ చేసుకున్నాము అని చెప్పుకొచ్చారు.

    ముందే ప్లాన్ చేసుకున్నాం

    ముందే ప్లాన్ చేసుకున్నాం

    ఆంధ్ర ప్రదేశ్ సినిమా టికెట్ రేట్ల ప్రకారం ఎంత బడ్జెట్ మేము సేఫ్ గా ఉంటాము అనేది ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ దాని మీద టికెట్ రేట్లు పెరిగితే అది మాకు బోనస్ అవుతుందని అనుకున్నాను అని చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ బ్యానర్ లో చాలా సినిమాలు చేశాం మాకు ఎలా బడ్జెట్ ని ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవాలో తెలుసు అయితే ఒకవేళ ఫెయిల్ అయితే ఎవరు ఆ సినిమాని కాపాడలేరు అని అన్నారు.

    టచ్ లోనే ఉంటాము

    టచ్ లోనే ఉంటాము

    అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలను జీవో జారీ చేయడానికి కంటే ముందు మొదలైన సినిమాలు అన్ని ఇబ్బందులు పడాల్సి ఉంది ఎందుకంటే వారు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసి ఉంటే ఏపీ టికెట్ల విషయం వారికి ఒక శరాఘాతంగా తగిలినట్టే అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన మెగాస్టార్ చిరంజీవి ఈరోజు వైయస్ జగన్మోహన్ రెడ్డితో అవుతున్న భేటీ గురించి కూడా మాట్లాడారు. మేము ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటామని అన్నారు.

    సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి

    సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి

    చిరంజీవి గారు వైయస్ జగన్ అపాయింట్మెంట్ గురించి నాకు ఒక వారం క్రితం చెప్పారు నేను అప్పుడు అక్కడికి వెళ్లి ఏదో ఒకటి చేయమని కోరా అని చెప్పిన ఆయన ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీ కోసమే పని చేస్తున్నారు కదా అని చెప్పుకొచ్చారు.'మా అందరి కోసమే చిరంజీవి జగన్తో సమావేశమయ్యారని అన్నారు. సినిమా విడుదల ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి వెళ్తా అన్నారు.. నేను వెళ్ళమని సలహా ఇచ్చానని అన్నారు. ఇద్దరి భేటీతో ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు.

    English summary
    Nagarjuna interesting comments about Chiranjeevi's meeting with AP CM Ys Jagan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X