twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటివంటేనే ఇష్టం.. ట్రై చేస్తే వర్కవుట్ కాలేదు.. తప్పు చేశా: నాగార్జున

    |

    టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వెండితెర, బుల్లితెరలపై హవా సాగిస్తున్నాడు. వరుస సినిమాలతో వెండితెరపై ఓ వెలుగు వెలుగుతూ బుల్లితెరపై కూడా కనువించు చేస్తున్నాడు. ఇక లుక్ పరంగా అయితే యంగ్ హీరోలు అవాక్కయ్యే విధంగా మేకోవర్ అయ్యాడు నాగార్జున. యువ హీరోలకు పోటీగా నిలుస్తూ తాజాగా మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన నాగార్జున తన కెరీర్‌కి సంబందించిన ఆసక్తికర విషయాలు చెప్పాడు.

    రకుల్‌తో నాగార్జున రొమాన్స్

    రకుల్‌తో నాగార్జున రొమాన్స్

    నాగార్జున తాజా సినిమా మన్మథుడు 2 లో రకుల్ ప్రీత్ సింగ్‌తో తెగ రొమాన్స్ చేసేశాడు. ఈ సినిమాలో నాగార్జున, రకుల్ రొమాంటిక్ డోస్ ఎలా ఉంటుందనేది ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ ద్వారా తెలిసిపోయింది. దీంతో మన్మథుడు 2 విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యూత్ ఆడియన్స్.

    నాగార్జున షాకింగ్ మేకోవర్

    నాగార్జున షాకింగ్ మేకోవర్

    ఇక మన్మథుడు 2 ప్రోమో వీడియోల్లో నాగార్జున మేకోవర్ చూసి షాక్ అవుతోంది సినీ లోకం. ఆరు పదుల వయసులోనూ వన్నె తరగని అందంతో చలాకీగా కనిపిస్తున్నాడు నాగ్. పైగా ఈ వయసులో `మన్మథుడు2` అనే రొమాంటిక్ లవ్‌స్టోరీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు.

    అలాంటివంటేనే ఇష్టం అంటున్న నాగ్

    అలాంటివంటేనే ఇష్టం అంటున్న నాగ్

    నాగార్జున తన కెరీర్ లో ఎన్నో డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. దేనికవి ప్రత్యేకమే. కానీ.. ఎన్ని క్యారెక్టర్స్ చేసినా తనకు మాత్రం సీరియస్‌గా సాగే సినిమాలంటే నచ్చదని అంటున్నాడు నాగార్జున. తాను ఫన్నీగా, రొమాంటిక్‌గా ఉండే సినిమాలనే ఇష్టపడతానని తాజా ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు.

    ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తప్పు చేశా

    ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తప్పు చేశా

    తన కెరీర్‌లో క్యారెక్టర్స్ విషయమై చాలా ప్రయోగాలు చేశానని అంటున్నాడు నాగ్. అయితే ఈ జర్నీలో కొన్ని తప్పులు కూడా చేశానని, వాటి నుంచి చాలా నేర్చుకున్నానని నాగ్ చెప్పుకొచ్చాడు. ద్విభాషా సినిమాలు చేసి మార్కెట్ పెంచుకోవాలని ఉందని, గతంలో కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసినా పెద్దగా వర్కవుట్ అవలేదని నాగార్జున అన్నాడు.

    మన్మథుడు 2 మూవీ

    మన్మథుడు 2 మూవీ

    రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' మూవీ తెరకెక్కింది. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Senior Hero Nagarjuna Manmadhudu 2 release date confirmed. This movie will release on August 9th. On This movie pramotions Nagarjuna says about his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X