twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ వయసులోనైనా రొమాన్స్ చేయొచ్చు.. ముద్దు పెట్టుకోవచ్చు: నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    |

    అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం 'మన్మథుడు 2'. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. దీనిని పురస్కరించుకుని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

     నాకు 30 ఏళ్లు నిండుతాయి

    నాకు 30 ఏళ్లు నిండుతాయి

    ఈ సినిమా ఆగస్టులోనే విడుదల కాబోతుండడానికి తోడు తన పుట్టినరోజు ఇదే నెలలో ఉండడంపై స్పందించిన నాగ్.. ‘ఆగస్టు నెల నాకు చాలా ఇష్టమైన నెల. మొన్ననే ‘బిగ్ బాస్' ప్రారంభమైంది. 9వ తారీఖున ‘మన్మథుడు 2' రిలీజ్ అవుతుంది. ఈ నెలాఖరికి నాకు 30 ఏళ్లు నిండుతాయి' అని సరదాగా మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ గోల గోల చేశారు.

    సినిమా టైటిల్‌పై క్లారిటీ

    సినిమా టైటిల్‌పై క్లారిటీ

    ఈ సినిమాకు మన్మథుడు 2 అని పెట్టడంపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ‘ఆ ఒరిజినల్ మన్మథుడుకి ఆడవాళ్లంటే పడదు. మరి ఆ సర్కిల్‌ని ఫినిష్ చేయాలి కదా. అందుకే ‘మన్మథుడు 2'కి ఆడవాళ్లంటే ఇష్టం. అందుకనే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం' అని ఆయన చెప్పుకొచ్చారు.

    ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా తీశాం

    ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా తీశాం

    ఈ సినిమాను ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా తీశామని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. గతంలో మన్మథుడు సినిమాకు సీక్వెల్ అని అంతా అనుకున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చిన నాగ్.. మరోసారి దానికి, దీనికి సంబంధం లేదని చెప్పేశారు.

    వయసుతో పని లేదు

    వయసుతో పని లేదు

    రొమాన్స్‌కు వయసుతో పని లేదని నాగ్ అన్నారు. దీనిపై మాట్లాడుతూ.. ‘నేను ఒక లవ్‌స్టోరీ చేయడమేంటని చాలా మంది అడిగారు. సంవత్సరం క్రితం ఓ ఫ్రెంచ్ ఫిలింను నాకు చూపించారు. ఇది నా వయసు తగ్గ సినిమా. ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు.. ఏ వయసులోనైనా రొమాన్స్ చేయొచ్చు అని చెప్పే సినిమా. అందుకే ఈ సినిమా చేశాను'అని నాగార్జున వివరించారు.

     నవ్వుతూనే ఉంటారు

    నవ్వుతూనే ఉంటారు

    అలాగే, అక్కినేని నాగార్జున చివర్లో తన సినిమా గురించి మాట్లాడారు. ‘మీకు ప్రామిస్ చేస్తున్నాను. ‘మన్మథుడు 2' కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంటారు' అని ఆయన వెల్లడించారు.

    English summary
    Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in August 9th. In this movie young heroine Rakul Preet Singh romance with Nagarjuna. sunday this movie pre release events conducted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X