చిరు పొలిటిక్స్ కి నాగ్ శుభాకాంక్షలు

సినిమాల్లోకి వచ్చినట్లే ఎవరైనా సరే రాజకీయ రంగంలోకీ ప్రవేశించవచ్చు. నా వరకూ అయితే అన్ని పార్టీల్లోనూ స్నేహితులున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లోనూ కొందరితో పరిచయాలున్నాయి. సినీ పరిశ్రమ మేలు దృష్ట్యా అధికారంలో ఉన్నవారితో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిదే' అని అన్నారు. మీకిష్టమైన నేతలెవరని ప్రశ్నించగా.. రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్, మన్మోహన్‌సింగ్‌లంటే ఇష్టమని బదులిచ్చారు. 'గాంధీ, నెహ్రూ, బోస్ గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. వారు నిజంగా గొప్ప నేతలు. నాకు రాజకీయాలు, పాలన గురించి తెలిసే సమయానికి రాజీవ్‌గాంధీ వచ్చారు.
పత్రికల ద్వారా ఆయన విధానాలు తెలుసుకున్నాను. రాజీవ్ పాలన వల్లే ప్రపంచీకరణకు మన దేశంలో బీజాలుపడ్డాయి. ఇక ఎన్టీరామారావు అయితే మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత. ఆర్థికమంత్రిగా ఉన్నప్పటి నుంచీ మన్మోహన్ విధానాలు, శైలి ఇష్టం' అని వ్యాఖ్యానించారు. ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని నాగార్జున చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ విధిగా ఓటు వేస్తానన్నారు. 'స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా ఓటు వేశాను. నాన్నగారు దాని విలువ గురించి ఎన్నోసార్లు చెప్పారు. అందుకే గతంలో ఓటు ప్రాధాన్యం గురించి ప్రచారం చేశాను. దాన్ని వేయని పక్షంలో పాలకుల్ని ప్రశ్నించే హక్కు కూడా ఉండదన్న వాస్తవాన్ని మరచిపోకూడదు' అని చెప్పారు. మంచి ఆలోచనే కదూ...


Click it and Unblock the Notifications











