నాగార్జున ఇంద్రజాలం ఎప్పుడు??
ఇప్పటి జనరేషన్ లో దర్శక నిర్మాతలు ఎలాంటి చిత్రాలను రూపొందిస్తే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ అభిస్తుందనే విషయంపై అవగాహన లేకుండా లక్షలు, కోట్లల్లో డబ్బు వృదా చేస్తూ, సినిమాలు విడుదలైనా ప్రేక్షాదరణలేక చాలా మంది నిర్మతలు నష్టాలపాలవుతున్నారు. తమిళం, కన్నడ, హింది వంటి డబ్బింగ్, రీమేక్, చిత్రాలు సైతం ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పడు చాలా మంది ఇంగ్లీష్ సినిమా కథల్ని తెలుగులోకి కూడా చక్కగా అన్వయించి సినిమాలు తీస్తున్న తీరు గురించి ఒక పెద్దాయన ప్రస్థావిస్తూ 'ఇంగ్లీషు" వాడు తుమ్మితే 'హిందీ" వాడికి జలుబు చేస్తుంది. 'తెలుగు" వాడు ముక్కు చీదుతాడు" అంటూ 'ఢ" చేశాడు.
హాలివుడ్ లో హిట్ అయిన 'మ్యాజిక్" అనే సినిమా ఇప్పటికే 'అక్షయ్ కుమార్" తో హిందిలో చేశారు. ఇప్పుడు అదే కథను తెలుగు లో నాగార్జునతో చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మ్యాజిక్ చేసే వ్యక్తి తన ట్రిక్కులతో మాయాజాలంతో ఒక కుటుంబాన్ని, సమాజాన్ని ఎలా రక్షించాడనే కథాంశంతో వస్తున్న సినిమా కోసం అక్కినేని నాగార్జున కొత్తగా కనిపించటానికి తన స్టయిల్ మార్చుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత నాగార్జున చేసే ఆ స్టయిల్ ఏంటా అని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











