కల్యాణ్ జ్యువెలర్స్ యాడ్ ఎందుకు చేసానంటే...నాగార్జున
రీసెంట్ గా నాగార్జున "కల్యాణ్ జ్యువెలర్స్" వారి వాణిజ్య ప్రకటనలో కనిపించారు. ప్రచార ప్రకటనల్లో పెద్దగా కనిపించటానికి ఆసక్తి చూపని నాగార్జున ఇలా ఓ బంగార విక్రయ షాపుకి ప్రచారం చెయ్యటం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్న అబిమానులకు ఆయన క్లారిఫై చేస్తూ మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ''వస్తువుల ప్రచారం కోసం పని చేయడాన్ని నేను ఎక్కువగా ఇష్టపడను. కానీ ఈ కల్యాణ్ జ్యువెలర్స్ మొదట్నుంచి నాకు తెలుసు. ప్రకటనలా కాకుండా బంగారం కొనేవారికి అవగాహన ఎలా కల్పించాలి. నాణ్యమైన పసిడిని ఎలా కొనాలో మాత్రమే ప్రకటనలో చెప్పాం. ఇదో అనుభవం'' అన్నారు. అలాగే ...బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నా జనం ఎక్కువగా బంగారం కొనడానికే ఆసక్తి చూపుతున్నారు.
బంగారమ్మీద పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు ..బ్యాంకులో డబ్బు దాయడం కంటే మేలైన బంగారం కొనుగోలు చేసే విధానం బాగా పెరిగింది. మెడలో గొలుసులు, లాకెట్లు వేసుకోవాలని అనిపించకపోయినా... బంగారమంటే చాలా ఇష్టం. బంగారు ఆభరణాల్లో వస్తున్న కొత్త కొత్త డిజైన్లను చూస్తుంటా. అమల మాత్రం డిజైన్‌తోపాటు, నాణ్యత ఎలా ఉందనేదీ చూస్తుంది. బంగారం కొనే బాధ్యతంతా ఆమెదే అన్నారు. ఇక నాగార్జున నటించిన 'రగడ' సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











