ఇండియన్ మూవీకి కొత్తదనం కావాలి..అదీ హాలీవుడ్ రేంజ్ లో వుండాలి...

By Sindhu

'గగనం" సినిమా గురించి తానేదైతే నమ్మానో అదే నిజయ్యిందని హీరో నాగార్జున ఆనందం వ్యక్తం చేశాడు. ప్రయోగాత్మక సినిమాల విషయంలో తానెప్పుడూ ముందుంటాననీ, చాలా సందర్భాల్లో ఫెయిల్యూర్స్ చవిచూసినా, ఒకటీ అరా సక్సెస్ లు దక్కినప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదని నాగ్ చెబుతున్నాడు. 'తెలుగు సినిమాకి..ఆ మాటకొస్తే, ఇండియన్ సినిమాకి కొత్తదనం కావాలి..అదీ హాలీవుడ్ రేంజ్ లో వుండాలి..దాని కోసం తపించేవారిలో నేను మొదటి వాడిని.."ఇది 'గగనం" హిట్ సందర్భంగా నాగార్జున చెప్పిన మాట.

'రాజన్న" సినిమా సైతం ప్రయోగాత్మక సినిమాల కోవలోకి వస్తుందనీ, తన కెరీర్ లో 'రాజన్న" ఓ మైలురాయిగా నిలిచిపోతుందనీ, 'గగనం" సినిమా అందర్నీ ఆలోచింపజేస్తోందని నాగ్ వ్యాఖ్యానించాడు. కొత్త దర్శకులు..కొత్త సినిమాలు..సినీ పరిశ్రమకు ఎంతైనా అవసరమన్న నాగ్, కమర్షియల్ పంథాలో కొనసాగుతూనే, ప్రయోగాత్మక సినిమాలు వస్తే తెలుగు సినీ పరిశ్రమ ముందు ముందు మరింత ఎత్తుకు ఎదుగుతుందని అంటున్నాడు. కథ చెప్పినప్పుడే రాధామోహన్ 'గగనం" సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో అంచనా వేశాననీ, అంచనాలను మించేలా 'గగనం" సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుండడం ఆనందంగా వుందని నాగ్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X