నాగార్జున ‘మోసగాడా’!?
నాగార్జున తాజా చిత్రానికి ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదు. కాన్ మ్యాన్ గా నాగార్జున విలక్షణమైన పాత్రని పోషిస్తోన్న ఈ చిత్రానికి 'రమ్మీ" అనే పేరుని ఇంతదాకా పరిశీలించారు. అయితే తాజాగా 'మోసగాడు" అనే టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. కిరణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇందులో నాగ్ సరసన మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటిస్తోంది. అమెరికా అమ్మాయి లిండా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్" ఫేం అంకుర్ విలన్ గా చేస్తున్నారు. నిర్మల్ పాండే, లగానే పేం అఖిలేంద్ర మిశ్రా, 'డాన్" విలన్ కెల్లీడార్జ్ క్యారెక్టర్స్ హైలెట్ అవుతాయి.
పేకాటలో రమ్మీ ఆటకూ చిత్ర కథకూ సంబంధం ఉండడంతో ..'రమ్మీ" అన్న టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలోచ్చాయి. కానీ ఈ ఆట ఎంతమందికి తెలుసు అన్న ప్రశ్న రేజ్ అయినప్పుడు టైటిల్ కన్పూజ్ గా ఉంటుందని భావించి 'రమ్మీ" టైటిల్ క్యాచీగానే వున్నా 'మోసగాడు" టైటిల్ కి మాసప్పీల్ వుండడంతో ఇదే పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. పైగా 'రమ్మీ" టైటిల్ ని వేరే బ్యానర్ పై ఎవరో ఆల్రెడీ రిజిష్టర్ చేసేశారు కూడా! నాగార్జున తనకు కలిసొచ్చిన 'డిసెంబర్" నెలను విడిచి ఓ అడుగు ముందుకేసి 'సంక్రాంతి" నాడు మోసగాడు ముందుకొస్తున్నాడు.


Click it and Unblock the Notifications











