twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున రియల్‌ హీరో: శేఖర్‌ కమ్ముల

    By Srikanya
    |

    హైదరాబాద్ : అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చి నాగార్జున రియల్‌ హీరో అనిపించుకున్నారు. ఇది మంచి కార్యక్రమం. యశోద ఆస్పత్రి వారికి అభినందనలు. వీర్చిన స్ఫూర్తితో నేనూ ఇదే బాటన నడవాలని నిర్ణయించుకున్నా అన్నారు ప్రముఖ సినీ దర్శకులు శేఖర్‌ కమ్ముల.

    హైదరాబాద్ నగరంలోని జీవన్‌దాన్‌ ట్రస్టు నాగార్జునతో కలిసి అవయవదానానికి పిలుపునిచ్చింది. వెల్లువలా స్పందన వచ్చింది. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చారు... తమ అవయవాలను మరొకరికి దానం చేసేందుకు సిద్ధమంటూ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఒకే రోజు దాదాపు 4,600 మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో అవయవ దానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనికి తరలి వచ్చిన యువత ఎంతో ఉత్సాహంతో అక్కడకక్కడే దరఖాస్తులు నింపి అందజేశారు.

    Nagarjuna is real hero: Shekar Kammula

    నాగార్జున మాట్లాడుతూ...మా నాన్న గారు తన అవయవయాలు దానం చేయాలని కోరారు. కానీ వృధ్దాప్యం వల్ల వాటిని తీసుకోలేము అని డాక్టర్లు అన్నారు. దాంతో ఆయన చివరకి తన శరీరం లోపల అమర్చిన పేస్ మేకర్ అయినా తీసి వేరే వారికి అమర్చమని అన్నారు. అలాగే కుటుంబ సబ్యులమైన మాతో కూడా అదే చెప్పారు. అసరమైన వ్యక్తికి పేస్ మేకర్ ని అమర్ఛమని కోరారు అన్నారు.

    తగిన సమయంలో అవి అందక ఎందరో అర్ధంతంగా తనువు చాలిస్తున్నారు. మరోవైపు అవగాహన లేక బ్రెయిన్‌డెత్‌(కెడావర్‌) అయిన కేసుల నుంచి అవయవాలు సేకరించలేని పరిస్థితి ఉంది. ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించాల్సిన అవయవాలు మట్టిలో కలిసిపోతున్నాయి. ఒక వ్యక్తి నుంచి సేకరించిన ఆర్గాన్లతో ఏడుగురి వరకు బతికించవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఈ చైతన్యం పెంచేందుకు యశోద ఆస్పత్రి ఒక మహోన్నత లక్ష్యంతో ముందుకొచ్చింది.

    సినీనటుడు అక్కినేని నాగార్జున, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు, హ్యపీ డేస్‌ ఫేం సోనియా తదితర సెలబ్రిటీలు ఎంతో ఆసక్తి చూపారు. నాగార్జున స్వయంగా యువతీయువకుల చేత ప్రతిజ్ఞ చేయించి వారిని అభినందించారు.

    English summary
    Akkineni Nagarjuna said... My father wanted to donate his organs but the doctors told him it would not be of help due to his old age and his health condition. He then asked the doctors to at least make use of the pace maker that was installed inside his body. He also told the family members to ensure that the pacemaker is reinstalled in a worthy and needy person
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X