»   » నాగార్జున గెస్ట్ రోల్ లో పూరీ జగన్నాధ్ చిత్రం..డిటేల్స్

నాగార్జున గెస్ట్ రోల్ లో పూరీ జగన్నాధ్ చిత్రం..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జునతో గతంలో సూపర్, శివమణి చిత్రాలు రూపొందించిన పూరీ జగన్నాధ్ త్వరలో మరో చిత్రం డైరక్ట్ చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున కేవలం గెస్ట్ గానే కనిపించనున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో హీరోగా చేయనున్నారు. జగపతి బాబు వందవ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని నంది శీహరి నిర్మిచనున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇక వరసగా పూరీ జగన్నాధ్ ప్లాపులతో దూసుకుపోతున్న నేపధ్యంలో ఈ చిత్రం ఎంతవరకూ క్రేజ్ వస్తుందనే విషయం ప్రక్కన పెడితే జగపతి బాబు మాత్రం తన వందవ చిత్రం కోసం తన అభిమాన ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనే నమ్మకంతో ఉన్నారు. అలాగే ఈ చిత్రాన్ని మొదట నట్టికుమార్ నిర్మించనున్నారని జగపతి బాబు ప్రకటించారు. అయితే నట్టికుమార్ నిర్మాతగా పూరీ చేయననటంతో ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు ప్రకటన వచ్చే అవకాసం ఉంది. ప్రస్తుతం పూరీ ..అమితాబ్ కాంబినేషన్ లో బుడ్డా చిత్రం రూపొందుతోంది.అది హిట్టయితే హిందీలో సెటిలవ్వాలనే ప్లాన్ లో పూరీ ఉన్నారు. ఆయన తాజా చిత్రం నేనూ...నా రాక్షసి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

English summary
Family hero Jagapathi Babu is all set to do his 100th film soon. The movie is reportedly said to be directed by Puri Jagannath and is being produced by Nandi Srihari. Nandi Srihari would produce the 100th movie of Jagapathi Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu