ఫోటోలు: బాలీవుడ్ భారీ చిత్రంలో నాగార్జున.. అందమైన ప్రదేశంలో రణబీర్, అలియాతో కలసి!
Recommended Video

కింగ్ నాగార్జున తన తొలి బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇది సూపర్ హీరో సినిమా అని సమాచారం. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ లో జాయిన్ అయ్యాక లొకేషన్ నుంచి నాగార్జున షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో నాగార్జున సతీమణి అమల కూడా ఉన్నారు.

బల్గెరియాలో షూటింగ్
ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలో జరుగుతోంది. అందమైన లొకేషన్ నుంచి చిత్ర యూనిట్ తో ఉన్న ఫోటోలని నాగార్జున ట్విట్టర్ లో షేర్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణబీర్, అలియా భట్ వంటి నటులతో నటించడం సంతోషంగా ఉందని నాగార్జున ట్వీట్ చేసారు.

స్వాగతం పలికిన కరణ్ జోహార్
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తమ చిత్రంలో నాగార్జున వంటి నటులు భాగం కావడం చాలా సంతోషంగా ఉందని కరణ్ జోహార్ అన్నారు.

అమలతో కలసి
నాగార్జునతో పాటు అమల కూడా షూటింగ్ లొకేషన్ లో సందడి చేసారు. రణబీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీతో, చిత్ర యూనిట్ తో దిగిన ఫోటోలని నాగార్జున షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

సూపర్ హీరో సినిమా
సంజు చిత్ర ప్రమోషన్స్ సమయంలో రణబీర్ ఈ చిత్రం గురించి స్పందించాడు. తాను ఈ చిత్రంలో పోషించే పాత్ర ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని వివరించాడు. ఇప్పుడే అన్ని విషయాలు వివరించలేనని తెలిపాడు. బాలీవడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఇది సూపర్ హీరో చిత్రం అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











