నాగ్, కార్తి మూవీలో తమన్నాను ఖరారు చేస్తూ ప్రెస్ నోట్...

By Bojja Kumar

హైదరాబాద్: నాగార్జున, కార్తీ కాంబినేషన్లో పివిపి సంస్థ ఓసినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రంలో శృతి హాసన్‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆమె ఉన్నట్టుండి ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో పెద్ద గొడవే జరిగింది. తర్వాత ఆమె స్థానంలో తమన్నాను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రెస్ నెట్ వివరాలు

Nagarjuna - Karthi-Tamanna film shooting details!

నాగార్జున, కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 9 నుండి హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో వేసిన భారీ సెట్ లో ఈ చిత్రం కోసం నాగార్జున, కార్తీ, తమన్నా పాల్గొంటున ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. తొలి షెడ్యూల్ చెన్నైలో జరిగింది. జూన్ నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్ తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.

Nagarjuna - Karthi-Tamanna film shooting details!

నాగార్జున మాట్లాడుతూ..‘తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. వంశీ ఎక్స్ ట్రార్డినరీ సబ్జెక్టు చెప్పాడు. సబ్జెక్టు వినగానే వెంటనే ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించాను. ఈ సబ్జెక్టుని వంశీ చాలా బాగా డీల్ చేస్తున్నాడు. పి.వి.పి చాలా పెద్ద లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అన్నారు.

కార్తి మాట్లాడుతూ...‘తెలుగులో నేను చేస్తున్న ఫస్ట్ స్ట్రయిట్ మూవీ ఇది. నాగార్జున గారి లాంటి పెద్ద స్టార్ తో కలిసి వర్క్ చేస్తున్నందుకు చాలా థ్రిల్ గా ఉంది. ఒకేసారి తెలుగు, తమిళ వెర్షన్స్ షూటింగ్ చెయ్యడం నాకు కొత్తగా ఎగ్జైటింగుగా ఉంది. చాలా మంచి కమర్షియల్ సినిమా ఇది ' అన్నారు.

Nagarjuna - Karthi-Tamanna film shooting details!

తమన్నా మాట్లాడుతూ...‘నాగార్జున, కార్తీ లాంటి స్టార్స్ తో కలిసి ఈ సినిమా చెయ్యడం వెరీ వెరీ హ్యాపీ. ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...‘మా కథకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యే నాగార్జున గారు, కార్తీలతో ఇంత భారీ మల్టీస్టారర్ చెయ్యడం చాలా చాలా హ్యాపీగా ఉంది. పి.వి.పి లాంటి పెద్ద సంస్థలో చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ట అయ్యేలా అద్భుతంగా రూపొందుతోంది' అన్నారు.

Nagarjuna - Karthi-Tamanna film shooting details!

నాగార్జున, కార్తి, తమన్నా, జయసుధ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఫోటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, మాటలు: అబ్యూరి రవి, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X