నాగార్జున 'కేడీ' చిత్రం రిలీజ్ అప్పుడే

By Srikanya

నాగార్జున హీరోగా కామాక్షి కళామూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'కేడి' చిత్రం జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మీడియాకు వెళ్ళడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గాంబ్లింగ్‌, కార్ల దొంగతనాల చుట్టూ తిరిగే తమాషా కథ. నాగార్జున పాత్ర ఆకట్టుకుంటుంది. కథ, కథనం నవ్యరీతిలో సాగుతాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ లో పాటను చిత్రిస్తున్నాం. జనవరి 4 నుంచి మరో పాటను తెరకెక్కిస్తాం. దాంతో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు. ఇక ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్‌ హీరోయిన్. కిరణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక మిగతా పాత్రల్లో లిండా,అంకుర్‌, నిర్మల్‌ పాండే, అఖిలేంద్ర మిశ్రా, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్ధన్‌, తనికెళ్ళ భరణి తదితరులు కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం సందీప్‌ చౌతా, కెమెరా సర్వేష్‌ మురారి, పాటలు చంద్రబోస్‌, కృష్ణచైతన్య అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా అక్కినేని వెంకటరత్నం వ్యవహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X