ఈ లేడీ యమ కేడీ!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ" చిత్రంలో 'ఏందబ్బయ్యా..." అంటూ మంచి రసికతో నటించిన మమతామోహన్ దాస్ శంఖర్ దాదా జిందాబాద్ లో 'ఆకలేస్తే అన్నంపెడతా.." అంటూ రాగాలు తీస్తూ అన్నింటా 'ఆల్ రౌండర్" అనిపించుకోవడానికి తహ తహ లాడుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో ఇలియానా, త్రిష, అనుష్క, కాజల్ లాంటి టాప్ హీరోయిన్ లతో మమతా పోటీ పడుతోంది. ప్రస్తుతం ఈ అందాల తార యువసామ్రాట్ నాగార్జున సరసన కేడీ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం 'కేడీ" నాగ్ ని వల్లో పడేసే కిలేడిలా ప్రేక్షకుల్ని మెప్పించడానికి సమాయాత్తమవుతోంది. 'కేడీ" ఈ లేడీ ని ఏ గమ్యానికి చేరుస్తుందో వేచి చూద్దాం.
కేడీ నాగార్జున మమతా మోహన్ దాస్ జూ ఎన్టీఆర్ యమదొంగ శంకర్ దాద జిందాబాద్ kadi nagarjuna mamata mohandas jr ntr yamadonga shankar dada zindabad


Click it and Unblock the Notifications