నాగార్జన 'కేడీ' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...

By Srikanya

నాగార్జున హీరోగా కామాక్షి కళామూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'కేడి' చిత్రం పిబ్రవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు..మీడియాకు నిర్మాత వెళ్ళడించారు. కానీ అనుకోని సిట్యువేషన్స్ వల్ల ఈ చిత్రం రిలీజ్ ఆగింది. ఇక ఈ చిత్రం గాంబ్లింగ్‌, కార్ల దొంగతనాల చుట్టూ తిరిగే తమాషా కథతో ఉంటుందని నిర్మాత చెప్తున్నారు. అలాగే నాగార్జున పాత్ర ఆకట్టుకుంటుందని, కథ, కథనం నవ్యరీతిలో సాగుతాయ అని అంటున్నారు. ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్‌, లిండా (యు.ఎస్) హీరోయిన్స్ గా చేస్తున్నారు. కిరణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక మిగతా పాత్రల్లో లిండా,అంకుర్‌, నిర్మల్‌ పాండే, అఖిలేంద్ర మిశ్రా, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్ధన్‌, తనికెళ్ళ భరణి తదితరులు కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం సందీప్‌ చౌతా, కెమెరా సర్వేష్‌ మురారి, పాటలు చంద్రబోస్‌, కృష్ణచైతన్య అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా అక్కినేని వెంకటరత్నం వ్యవహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X