నాగార్జున 'సోషియో ఫాంటసీ' చిత్రం లేటెస్ట్ ఇన్ఫో....
నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని నిర్మించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ తొమ్మిదవ తేదిన ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారం వరకూ...వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రం కామిడీతో కూడిన అరుంధతి తరహా అంశాలతో చిత్రం ఉండబోతుందని పరిశ్రమలో వినపడుతోంది. ఇక శ్రీనివాస రెడ్డి గతంలో యమగోల మళ్ళీ మొదలైంది, బొమ్మనా బ్రదర్శ్..చందనా సిస్టర్స్, టాటా బిర్లా...మధ్యలో లైలా వంటి కామిడీలను అందించారు. ఇత ఈ కథ విని నాగార్జున ఎంతో ఎక్సైట్ అయ్యారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అత్యున్నత సాంకేతిక విలువలు కూడా ఇందులో ఉంటాయి. భారీ తారాగణంతో పాటు అగ్ర సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తారు. హై స్టాండర్డ్స్‌తో ప్రెస్టీజియస్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నాగార్జున సరసన ఓ స్టార్ హీరోయిన్ నటించనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని నిర్మాత వెంకట్ తెలిపారు. ఇక హీరోయిన్ గా అనూష్కని అడిగారని..అయితే ఆమె డేట్స్ దొరకటం కష్టంగా ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











