ఎన్టీఅర్ ని,మహేష్ ని అడగండి:నాగ్

కింగ్ టైటిల్ గురించి చెబుతూ.. నిజానికి ఈ చిత్రానికి 'బొట్టు శ్రీను' టైటిల్ పెట్టమన్నా కానీ, శ్రీను వైట్ల ఒప్పుకోలేదు. సినిమా అంతా కింగ్ పాత్ర చుట్టూ నడుస్తుంది కాబట్టి 'కింగ్' అని పెట్టాలని పట్టుబట్టాడు. ఇక నాతో పాటు శ్రీహరి, త్రిష, మమతల నటన కూడా సినిమా విజయానికి తోడ్పడ్డాయి. మమత నటన నాకు చాలా నచ్చింది. పర్సనల్‌గా ఆమెకు ఫ్యాన్‌ని అయిపోయా అన్నారు.
అలాగే కింగ్ కలెక్షన్స్ గురించి చెబుతూ..చాలా బాగున్నాయి. ఇది ఔట్ అండ్ ఔట్ పైసా వసూల్ సినిమా. ఇదివరకటి 70 రూపాయల టిక్కెట్ గనుక ఉన్నట్టయితే తొలి వారంలో ఆల్‌టైమ్ రికార్డ్స్ వచ్చేవి. అయినప్పటికీ ఈ 50 రూపాయల టిక్కెట్లమీద లాంగ్‌రన్‌లో కలెక్షన్లు బాగా ఉంటాయనే అనుకుంటున్నా.అన్నారు.
'ఎ శ్రీను వైట్ల ఫిల్మ్' అని పోస్టర్స్ లో వేయటానికి కారణం ...'కింగ్'లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన బొట్టు శ్రీను పాత్ర నాకు బాగా నచ్చింది. అలాగే చిత్రంలోని మలుపులు కూడా. రానున్న సీనులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించని రీతిలో శ్రీను ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేశాడు. కొన్ని క్లిష్టమైన సీన్లను అతను తెరకెక్కించిన తీరు అమోఘం.కాబట్టి 'కింగ్'ని శ్రీను సినిమా అనే అంటా. అందుకే ప్రమోషన్‌లో 'ఎ శ్రీను వైట్ల ఫిల్మ్' అని వేశాం.
లెంగ్త్ ఎక్కవయిందంటున్నారు? ఎలాంటి సినిమాకైనా విమర్శలు వస్తాయి. జనం వినోదం కోసమే వస్తారు కానీ, వారు సినిమా నిడివి గురించి పట్టించుకోరు. అట్లా అయితే హిందీ 'గజిని' మూడు గంటల పైనే ఉన్నా పెద్ద హిట్టయ్యింది కదా. నిడివి ఎక్కువయ్యిందనే కామెంట్లు రావడంతో శ్రీను రెండు సీన్లు ట్రిమ్ చేశాడు. అవి రెండూ మంచి సీన్లే. నేనైతే అలా చేయొద్దనే చెప్పా.
ఇక పైరసీ గురించ చెబుతూ దేశానికి టెర్రరిజం ఎలా సమస్యో,సినీ పరిశ్రమకు పైరసీ అలాంటి టెర్రరిస్టులాంటిది. ఇప్పటికే 'కింగ్' సినిమా మొత్తాన్ని ఇంటర్నెట్‌లో పెట్టేశారంటే పైరసీ ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కర్ణాటకలో చిత్రసీమంతా ఐకమత్యంగా ఉండటం వల్ల అక్కడ కన్నడ సినిమా పైరసీ అనేదే లేదు. అలాంటి ఐకమత్యం మన ఇండస్ట్రీకి కావాలి. నేను వెళ్లిన చాలామంది సినిమావాళ్ల ఇళ్లల్లోనే కుప్పలు తెప్పలుగా పైరసీ సీడీలు చూశా... అన్నారు.


Click it and Unblock the Notifications











