అమితాబ్‌తో అదిరింది: నాగార్జున
హైదరాబాద్: కింగ్ నాగార్జున కల్యాణ్ జ్యువెల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శనివారం కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆ సంస్థ శాఖను నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంది అభిమానుల మధ్య కల్యాణ్ జ్యువెల్లర్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్‌తో చేసిన యాడ్ చాలా బాగా వచ్చింది. చూసినవారంతా అప్రిషియేట్ చేస్తున్నారు' అన్నారు.
ప్రస్తుతం నాగార్జున 'లవ్ స్టోరీ' చిత్రం చేస్తున్నాడు. దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మరో వైపు నాగ్ నటించి 'డమరుకం' చిత్రం అక్టోబర్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సెప్టెంబర్ 10వ తేదీన ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఇక నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వస్తున్న మరో భక్తిరస చిత్రం 'షిరిడి సాయి' సెప్టెంబర్ 6న విడుదలవ్వబోతోంది. షిరిడి సాయి బాబా చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఇప్పటికే సాయిబాబా చరిత్రపై పలు చిత్రాలు వచ్చినప్పటికీ దర్శకేంద్రుడు ఈచిత్రాన్ని తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున చేస్తున్న సాయి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయిబాబా గెటప్ లో నాగార్జున ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











