twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాశీకి పోతున్న యువ సామ్రాట్

    By Srikanya
    |

    నాగార్జున ఈ వారంలో కాశీకి ప్రయాణం అవుతున్నారు. ఆయన తాజా చిత్రం ఢమరకం షూటింగ్ నిమిత్తం ఆయన ఈ ప్రయాణం పెట్టుకున్నాడు. రాజన్న చిత్రం విడుదల సమయానికి ఆయన ఊళ్లో ఉండరు. విడుదల తర్వాత వీకెండ్ లో ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. ఇక రాజన్న చిత్రంపై ఆయన బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ విషయం చెప్తూ...నేను రాజన్న చిత్రం విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను...అందుకనే నేను ఢమురకం షూటింగ్ లో ఏక్టివ్ గా పాల్గొంటున్నాను. రాజన్న విడదల విషయమై నేను వర్రీగా లేను అన్నాను అన్నారు. నాగార్జున తాజా చిత్రం ఢమురకం లో అరుంధతి తరహా ఆఘోరా పాత్ర ఉన్నట్లు సమాచారం.

    అరుంధతిలో సోనూసూద్ కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ ఈ పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ పాత్ర ఇంటర్వెల్ దగ్గర ఇచ్చే ట్విస్ట్ సినిమాకి కీలకమై నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.

    ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Nagarjuna is leaving for Varanasi for the shoot of his other movie - Dhamarukham.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X