Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిర్మాతను హెచ్చరిస్తూ నాగార్జున ప్రకటన
నాగార్జున హీరోగా చేసిన బాలీవుడ్ చిత్రం 'అగ్నివర్ష'ని తెలుగులోకి డబ్బింగ్ చేసి 'అగ్నివర్షం' టైటిల్ తో విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం డబ్బింగ్ చేయటం ఇల్లీగల్ అని, నాగార్జున లీగల్ నోటీస్ ఈ రోజు (గురువారం) ఇచ్చారు. అందులో తెలియచేసిందేమిటంటే...నాగార్జున(క్లయింట్) 30-03-2001 నాడు హెచ్ ఎన్ బి ఐ మరియు సన్నీ ఫిల్మ్ వారితో రాసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం అగ్నివర్ష హిందీ సినిమాలో నటించటానికి ఒప్పుకున్నాడు. అయితే ఆ ఎగ్రిమెంట్ ద్వారా కండీషన్ నంబర్ 3.3 లో రాసుకున్న ప్రకారం నిర్మాతలు నాగార్జున అనుమతి లేనిదే అగ్నివర్ష సినిమాని తెలుగులోకి అనువదించుటకు వీలులేదు. అయితే ఇప్పుడు డబ్బింగ్ చేస్తున్నారని దిన పత్రికలు ద్వారా తెలియవచ్చింది.
ఆ సినిమాని నాగార్జున అనుమతి లేనిదే డబ్బింగ్ లేదా రిలీజ్ చేయడానికి ప్రయత్నించినా కానీ అట్టి వారు చేయు పనులకు నాగార్జు తీసుకోబడే సివిల్ మరియు క్రిమినల్, చట్టపరమైన చర్యలకు భాద్యులగుదురు. అలాగే అగ్నివర్ష హిందీ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేయకూడదని మరియు విడుదుల చేయకూడదని హెచ్చరించడమైనది అని ప్రకటన ఇచ్చారు. ఇక గిరీష్ కర్నాడ్ రచించిన నాటకం ఆధారంగా బాలీవుడ్ లో డైరెక్టర్ అర్జున్ సజనాని 'అగ్నివర్ష' చిత్రం రూపొందించారు. అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ప్రభుదేవా, జాకీ ష్రాఫ్, మిళింద్ సోమన్, రవీనా టాండన్, దీప్తి భట్నాగర్, సోనాలి కులకర్ణి ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రిలీజ్ అయింది.