నాగ్ ‘లవ్ స్టోరీ’ టైటిల్ మార్పు...!
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రానికి తాత్కాలికంగా 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు ఈ చిత్రానికి టైటిల్ మార్చి, అఫీషియల్ టైటిల్ ప్రకటించేందుకు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఈచిత్రం కోసం 'చంద్రుడు', 'ప్రేమికుడు' అనే రెండు టైటిళ్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే వీటిలో ఏదో ఒకటి ఫైనల్ కానుంది.
చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపకుంటోంది. ఇటీవలే యూరఫ్ లో ఓ షెడ్యూల్ పూర్తి కాగా ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగుకు జరుగుతోంది. ఇక్కడ ఓ సాంగు చిత్రీకరణతో పాటు కొన్ని సీన్లు, యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో ఇక్కడ షూటింగ్ పూర్తి కానుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.


Click it and Unblock the Notifications











