గోల్డ్ బిజినెస్... నాగార్జున-మహేష్ బాబు పోటీ!
హైదరాబాద్: నాగార్జునకి.. మహేష్ బాబుకీ చాలా జనరేషన్ గ్యాప్ ఉంది వీరి మధ్య పోటీ ఏంటి? అనుకుంటున్నారా...! వీళ్ల మధ్య సినిమాల పోటీ లేని విషయం వాస్తవమే కానీ, ఓ విషయంలో మాత్రం ఇద్దరూ పోటా పోటీగా ముందుకు సాగుతున్నారు. అది మరెందులోనో కాదు... గోల్డ్, డైమండ్స్ బిజినెస్‌లో. వీరు నేరుగా బిజినెస్ చేయడం లేదు కానీ..... ఆ బిజినెస్ చేస్తున్న సంస్థలకు ప్రచార కర్తలుగా, వాటి సేల్స్ పెంచేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
నాగార్జున 'కల్యాణ్ జ్యువెల్లర్స్'కి ప్రచారం చేస్తుండగా.... మహేష్ బాబు 'జోస్ అలుకాస్' తరుపున ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు పోటా పోటీగా షోరూములు ప్రారంభించబోతున్నారు. కల్యాణ్ జ్యువెల్లర్స్ కొత్త షోరూంను రేపు హైదరాబాద్ లో కూకట్ పల్లిలో నాగార్జున ప్రారంభించబోతుండగా, 'జోస్ అలుకాస్' కొత్త షోరూంను సెప్టెంబర్ 15న విశాఖలో మహేష్ బాబు ప్రారంభించబోతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే... మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. నాగార్జున నటించిన 'డమరుకం', 'షిరిడి సాయి' చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications