»   »  వినాయక్ పై నాగ్, ప్రిన్స్ గుర్రు?

వినాయక్ పై నాగ్, ప్రిన్స్ గుర్రు?

Posted By:
Subscribe to Filmibeat Telugu


వివినాయక్ ఎంతటి సక్సెస్ ఫుల్ దర్శకుడో అందరికీ తెలుసు. అందుకే హీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహం చూపుతారు. వినాయక్ ఊపుకు అచ్చెరువొందిన మహేష్ బాబు సైతం పోకిరి సినిమాకు ముందు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహం చూపాడు. అయితే వినాయక్ ఏ విషయం చెప్పకపోవడంతో లాభం లేదనుకుని మహేష్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈయనతో సినిమాలు చేయొద్దని కూడా నిర్ణయించుకున్నాడు.

నాగార్జున విషయంలోనూ ఇలాగే జరిగింది. చేద్దామా వద్దా అనే విషయాన్ని వినాయక్ స్పష్టంగా చెప్పకపోవడంతో నాగార్జున కూడా మహేష్ లాగే నిర్ణయం తీసుకున్నాడట. చిరంజీవి వర్గం పట్లే వినాయక్ ఎపుడూ మొగ్గు చూపుతుంటాడని అనుకున్నారట. అందుకే నాగార్జున, మహేష్ బాబులు వినాయక్ దర్శకత్వంలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఫిలింనగర్ పుకారు.

Read more about: nagarjuna mahesh babu vv vinayak
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X