twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చారిత్రిక చిత్రంలో నాగార్జున ?

    By Staff
    |
    Nagarjuna
    ఎన్నాళ్ళగానో ఊరిస్తున్న గుణశేఖర్ 'గోన గన్నారెడ్డి' ప్రాజెక్టు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చినట్లు కనపడుతోంది.ఈ సినిమాను కొంత కాలం క్రితం 'కత్తి' అని టైటిలు నిర్ణయించి జూనియర్ యన్టిఆర్ తో చేద్దామని ప్రయత్నించారు. కాని ప్రాజెక్టు మెటీరిలైజ్ కాలేదు. తరువాత అంత భారీ ఖర్చుతో సినిమా తీయటానికి నిర్మాతలు ముందుకు రాలేదు. దాంతో ఈ సినిమా అటకెక్కింది. కాని ఇప్పుడు దానికి మంచి రోజులు వచ్చాయి. గన్నా రెడ్డి పాత్రను నాగార్జున చేయటానికి అంగీకరించారని తెలుస్తోంది. రెగ్యులర్ గా నాగార్జునతో సినిమాలు తీసే నిర్మాత దీనికి పూనుకుంటున్నారని తెలుస్తోంది.
    ఈ చారిత్రిక చిత్రం గోన గన్నారెడ్డి అనే యోధుడి నిజ జీవిత గాథ. నాగార్జున రామదాసు గా ...అన్నమయ్య గా తన దైన శైలిలో లీనమై పాత్రలకు ప్రాణం పోయటంతో ఆ విజువల్స్ మదిలో మెదిలి ఆయనను గుణశేఖర్ కలిసారని తెలుస్తోంది. అలాగే నాగార్జున కూడా విభిన్న తరహా చిత్రాలకు ముందుండే వ్యక్తి కావటంతో ఈ సినిమాకి ఒప్పుకున్నట్లు పరిశ్రమ భావిస్తోంది. సాధారణ సోషల్ చిత్రాలకే గుణశేఖర్ సెట్స్ వేసి భారీగా కథను నడిపిస్తూంటాడు. అలాంటిది చారిత్రిక చిత్రం అంటే ఇంక తిరుగేముంది . అచ్చం హాలీవుడ్ తరహాలో పూర్తి స్ధాయిలో ఆ కాలానికి మనని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడంటున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ ఈ స్కిప్టు పై కృషి చేస్తున్నాడట. ఆయన త్వరలో బాలకృష్ణ తో సాధు ప్రారంభించబోతున్నారు. మరోప్రక్క నాగార్జున కింగ్ గా తయరవ్వటానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు పూర్తి అయ్యాక ఈ సినిమా ఉండవచ్చు అంటున్నారు. అంటే త్వరలోనే తెలుగు వారికి మంచి విజవల్ ట్రీట్ అందుతుందన్నమాట.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X