Nagarjuna: ప్రధానితో అక్కినేని ఫ్యామిలీ భేటీ.. కారణం ఏంటంటే..?
PM Modi- Nagarjuna: ప్రధాని మోదీతో టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున సమావేశమయ్యారు. నాగార్జున తన కుటుంబంతో కలసి ఢిల్లీలోకి పార్లమెంట్ హాల్ కు వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో సహా పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయానికి నాగార్జున వెళ్లారు. నాగార్జునతో పాటు.. అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల భేటీ అయ్యారు. గతంలోనూ నాగార్జున పలు సందర్భాల్లో ప్రధాని మోదీ తో భేటీ అయ్యారు.
ఇటీవల కొద్ది రోజుల క్రితం మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వర రావు పై ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా జరిగిన మీటింగ్ అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంఛ్ గురించి అని వార్తలు వస్తున్నాయి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ 'బుక్ లాంచ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని నాగార్జున కోరగా ఆవిష్కరించారు.

ప్రధానిని కలిసే ముందు నాగార్జున పార్లమెంటులోని టీడీపీ ఆఫీసు కు వెళ్లినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు చేసిన కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఆ తరువాత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు.. అక్కినేని నాగ చైతన్య తాజా సినిమా 'తండేల్' సినిమా నేడు విడుదల అయింది. తండేల్' విడుదల అయిన రోజునే ప్రధానితో ప్రత్యేక భేటీ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య - శోభితను నాగార్జున ప్రధానికి పరిచయం చేసారు. వీరిని ప్రధాని అభినందించారు.


Click it and Unblock the Notifications











