నాగార్జున ‘రాజన్న’ డిసెంబర్ 22న విడుదల?
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటిస్తున్న తాజా సినిమా 'రాజన్న". రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక చారిత్రాత్మక అంశాన్ని బేస్ చేసుకుని రూపొందిన ఈ సినిమా...దసర సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వాయిదా పడింది.
తెలంగాణ అంశంతో రూపొందుతున్నప్పటికీ ఈ సినిమాకు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉండదని నాగార్జున ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు సినిమా నిర్మాతలు. రాజన్న యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











