twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంగార్రాజు గెటప్‌లో అదరగొట్టిన అక్కినేని త్రయం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన'. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    కాగా... సినిమా ప్రమోషన్లో భాగంగా అక్కినేని త్రయం బంగార్రాజు గెటప్ లో హల్ లచ్ చేసారు. సోగ్గాడె చిన్నినాయనా సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు గెటప్ లో ముగ్గూరూ వైట్ అండ్ వైట్ పంచె కట్టులో అదరగొట్టారు.

    సనిమా గురించి నాగార్జున మాట్లాడుతూ..తొలిసారిగా ‘సోగ్గాడే చిన్నినాయనా' ఫుల్ కామెడీ చిత్రంలో తాను నటిస్తున్నానని, సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు పాత్రల్లో తేడాలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని తెలిపారు.

    స్లైడ్ షోలో ఫోటోస్...

    ఫాదర్ క్యారెక్టర్

    ఫాదర్ క్యారెక్టర్

    ఫాదర్‌ క్యారెక్టర్‌ ఇందులో ఘోస్ట్‌గా కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే విచిత్రమైన క్యారెక్టర్‌ అది. ఈ పాయింట్‌ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌ అనిపించింది.

    టైటిల్

    టైటిల్

    వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని 'సొగ్గాడే చిన్ని నాయనా' అనే టైటిల్‌ పెట్టామని తెలిపారు నాగార్జున.

    నటీనటులు

    నటీనటులు

    నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

    English summary
    Check out Akhil, Nagarjuna, Naga Chaitanya in Soggade Chinninayana Getup Photos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X