నాగచైతన్య, కృష్ణ వంశి కాంబినేషన్ చిత్రం లాంచింగ్ డేట్
కృష్ణవంశీ దర్శకత్వంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి ఒకే చిత్రంలో కనపడనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రారంభం కానుందని సమాచారం. ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు కావటమే ఈ తేదిని నిర్ణయించటానికి కారణం అని తెలుస్తోంది. చందమామ చిత్రం తీసిన సి.కళ్యాణ్ ఈ చిత్రం నిర్మిచనున్న ఈ చిత్రం సబ్జెక్టు డిస్కషన్స్ పూర్తయి లాంచింగ్ కోసంఎదురుచూస్తోంది. చంద్రలేఖ తర్వాత నాగార్జున,కృష్ణవంశీ దర్శకత్వంలో చిత్రం రాలేదు. ఆ రకంగానూ ఈ ప్రాజెక్టు క్రేజీగా మారనుంది. ఇక ఈ స్టోరీ లైన్ ఈ మూడు తరాల హీరోలు విని ఓకే చేసారని సమాచారం. నాగాశ్వరరావు, నాగార్జున కాంబినేషన్ లో గతంలో కలెక్టర్ గారబ్బాయి, ఇద్దరు ఇద్దరే, శ్రీ రామదాసు చిత్రాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం నాగార్జున..వీరూ పోట్ల దర్శకత్వంలోనూ, శ్రీనివాస రెడ్డి డైరక్షన్ లోనూ, విజయేంద్ర ప్రసాద్, గౌతం మీనన్ లతోనూ చిత్రాలు చేయటానికి కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











